SP Balasubramanyam : ప్రధమ వర్థంతి సందర్భంగా.. బాలు జీవిత విశేషాలు..

సంగీతారాధ్యులు.. శ్రీపతి పండితారాధ్యుల ఎస్పీ బాలు ప్రధమ వర్థంతి నేడు (సెప్టెంబర్ 25)..

SP Balasubramanyam : ప్రధమ వర్థంతి సందర్భంగా.. బాలు జీవిత విశేషాలు..

Spb

SP Balasubramanyam: గత ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించారు.. గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతేడాది సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు. నేడు ఆయన ప్రధమ వర్థంతి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సంగీత కళాకారులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలుకి నివాళులర్పిస్తున్నారు.

Sp Balasubrahmanyam

 

బాలు ప్రథమ వర్థంతి సందర్భంగా ఒకసారి ఆయన జీవిత విశేషాలను చూద్దాం..
* 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం
* సాంబమూర్తి, శకుంతల తల్లిదండ్రులు
* నెల్లూరు, నగరి, శ్రీకాళహస్తి, తిరుపతి, అనంతపుపరం, చెన్నైలో విద్యాభ్యాసం
* ఆయన భార్య పేరు సావిత్రి
* ఆయన కుమార్తె పల్లవి, కొడుకు చరణ్

Spb Family

 

1967లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంతో గాయకుడిగా పరిచయం

* శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వంలో పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఈలపాట రఘురామయ్యతో కలిసి తొలిపాట పాడారు. ‘ఏమి ఈ వింత మోహము’ అనేది తొలిపాట.
* 1966 డిసెంబర్ 15న ఈ పాటను రికార్డింగ్ చేశారు.
* ‘నక్కరే అదే స్వర్గ’ చిత్రంలో పి.సుశీలతో ‘కనసిదో ననసిదో’ తొలి కన్నడ పాట
* ఆయన పాట పాడిన ‘హోటల్ రంభ’ అనే తమిళ సినిమా విడుదల కాలేదు.
* ‘శాంతి నిలయం’ చిత్రంలో పి.సుశీలతో ఆయన పాడిన తొలి తమిళపాట విడుదలైంది.
* ఘంటసాలతో కలిసి ఏకవీర, మంచి మిత్రులు, దేవుడు చేసిన మనుషులు, అలీబాబా 40 దొంగలు, నీతి – నిజాయతీ చిత్రంలో పాడారు.

Spb Singing

* మలయాళంలో ‘కడల్ పాలమ్’ అనే చిత్రంతో సోలో సాంగ్‌తో పరిచయమయ్యారు.
* హిందీలో 1981లో ‘ఏక్ దుజే కేలియే’ చిత్రంలో తేరే మేరే బీచ్ మే ఆయన పాడిన తొలి పాట.
* సంగీత దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘కన్యాకుమారి’ 1977.
* తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
* దాదాపు 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు బాలు
* కమల్ హాసన్, భాగ్యరాజా, కుల్భూషన్ కర్బందా, పరేష్ రావెల్, విసు, టి.రాజేందర్, సుమన్, జగపతిబాబు, నరేష్, మోహన్‌లాల్, జెమినీ గణేష్, నాగార్జున (తమిళం), రఘువరన్ కు డబ్బింగ్ చెప్పారు.

Spb Team

 

* మహమ్మద్ రఫీ, జానకి, ఏసుదాస్, సోనూ నిగమ్ అంటే ఆయనకు చాలా ఇష్టం.
* మాయాబజార్ సినిమా తనకు ఫేవరేట్ అని చెప్పేవారు
* యమన్ రాగాన్ని అమితంగా ఇష్టపడేవారు
* క్రికెట్, టెన్నిస్ చూడడం ఇష్టం
* తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు
* తొలిసారి 1972లో ‘మహ్మద్ బీన్ తుగ్లక్’ చిత్రంలో ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ పాడుతూ కనిపించారు

Aditya 369

 

*1991లో బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావుతో తెలుగు చలనచిత్ర చరిత్రలో గుర్తుండిపోయే ‘ఆదిత్య 369’ చిత్రాన్ని నిర్మించారు.
* మలయాళ ‘యోధ’ చిత్రాన్ని అనువదించి నిర్మాతగా మారారు. ఎస్.ఎల్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై పిల్లలు పల్లవి – చరణ్ పేరుతో అనువాదం చేశారు.
* 1994లో ఎస్.ఎల్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై తమిళంలో ‘హలో బ్రదర్’ ని అనువదించారు. నాగార్జున రెండు పాత్రలకూ తమిళంలో బాలూనే డబ్బింగ్ చెప్పారు.
* 1996లో ‘భామనే సత్యభామనే’ చిత్రాన్ని నిర్మించారు.
* 2000లో ‘తెనాలి’, 2005లో ‘శుభసంకల్పం’ నిర్మించారు

Balu