Sprite: ”లోప‌ల అదే స్ప్రైట్.. బ‌య‌ట లుక్ మాత్రం మారింది”.. ఇక‌ తెల్ల బాటిళ్ళ‌లో స్ప్రైట్

స్పైట్ డ్రింకు రంగు తెల్ల‌గానే ఉంటుంది. దాని బాటిల్ రంగు మాత్ర‌మే ఆకుప‌చ్చ‌గా ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇక‌పై స్ప్రైట్ తెలుపు రంగు బాటిళ్ళ‌లోనే క‌న‌ప‌డ‌నుంది. ఇందుకు సంబంధించి దాని మాతృసంస్థ కోకాకోలా అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఇందుకు సంబంధించిన యాడ్‌ను కూడా వినూత్న రీతిలో రూపొందిచింది. ''లోప‌ల అదే స్ప్రైట్.. బ‌య‌ట లుక్ మాత్రం మారింది''.. ''కొత్త బాటిల్.. అదే స్ప్రైట్'' అంటూ ఓ యాడ్ రూపొందించింది.

Sprite: ”లోప‌ల అదే స్ప్రైట్.. బ‌య‌ట లుక్ మాత్రం మారింది”.. ఇక‌ తెల్ల బాటిళ్ళ‌లో స్ప్రైట్

Sprite

Sprite: స్ప్రైట్.. ఎండ‌లో తిరిగే వారికి మొద‌ట‌గా గుర్తుకువ‌చ్చే కూల్ డ్రింక్ ఇది. ఇంట్లో వేడుకల స‌మ‌యంలోనూ స్ప్రైట్‌ను బాగా వాడేస్తుంటారు. చిన్న పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు అంద‌రికీ స్ప్రైట్ అంటే ఇష్ట‌మే. స్ప్రైట్‌కు సంబంధించిన యాడ్స్‌ను కూడా చాలా సృజ‌నాత్మ‌కంగా తీస్తుంటారు. స్ప్రైట్ అంటే మ‌నకు ముందుగా గుర్తుకువ‌చ్చేది దాని రుచి, చ‌ల్ల‌ద‌నం మాత్ర‌మే కాదు.. దాని బాటిల్ రంగు కూడా. గ‌త 60 ఏళ్ళుగా దాని బాటిల్ రంగు ఆకుప‌చ్చ‌గానే ఉంది. అయితే, ఇప్పుడు అది మారనుంది.

స్పైట్ డ్రింకు రంగు తెల్ల‌గానే ఉంటుంది. దాని బాటిల్ రంగు మాత్ర‌మే ఆకుప‌చ్చ‌గా ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇక‌పై స్ప్రైట్ తెలుపు రంగు బాటిళ్ళ‌లోనే క‌న‌ప‌డ‌నుంది. ఇందుకు సంబంధించి దాని మాతృసంస్థ కోకాకోలా అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఇందుకు సంబంధించిన యాడ్‌ను కూడా వినూత్న రీతిలో రూపొందిచింది. ”లోప‌ల అదే స్ప్రైట్.. బ‌య‌ట లుక్ మాత్రం మారింది”.. ”కొత్త బాటిల్.. అదే స్ప్రైట్” అంటూ ఓ యాడ్ రూపొందించింది.

దాదాపు ఆరు ద‌శాబ్దాల పాటు ఆకుప‌చ్చ రంగులో క‌న‌ప‌డిన స్ప్రైట్ ఇప్పుడు తెల్ల‌రంగు బాటిళ్ళ‌లోకి మార‌డం వెనుక పెద్ద కార‌ణ‌మే ఉంది. ఈ ప్లాస్టిక్ బాటిళ్ళ‌ను రీసైక్లింగ్ చేసే స‌మ‌యంలో ఆకుప‌చ్చ రంగులో అవి ఉంటే కొన్ని సమ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ట‌. పర్యావరణహితం కోసం త‌మ‌ బాటిళ్ళ‌ను రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉత్పత్తి చేస్తున్నామ‌ని ఆ సంస్థ తెలిపింది. రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ నాణ్యతతో ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తెల్ల‌ బాటిళ్ళ‌లో స్ప్రైట్ వ‌చ్చే నెల 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఆకుప‌చ్చ బాటిళ్ళ‌లో స్పైట్ తాగాల‌ని అనిపిస్తే స్టాక్ ఉన్న‌లోపే తాగేయండి..

 

Urinary Delay : మూత్ర విసర్జనలో జాప్యమా! అయితే జాగ్రత్త