Urinary Delay : మూత్ర విసర్జనలో జాప్యమా! అయితే జాగ్రత్త

శరీరంలో పెల్విక్ ఫ్లోర్ బలహీనమైతే మనం ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సిన పరిస్ధితులు ఎదురవుతాయి. అలా కాకుండా ఉండాలంటే మూత్ర విసర్జన చేయాలన్న సంకేతం మెదడుకు అందిన వెంటనే మూత్రాన్ని ఆపుకోకుండా వెంటనే విసర్జన చేయాలి. దీని వల్ల మూత్రాశయ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

Urinary Delay : మూత్ర విసర్జనలో జాప్యమా! అయితే జాగ్రత్త

Urinary Delay

Urinary Delay : శరీరం నుండి వ్యర్థ పదార్థాలను సకాలంలో తొలగించడంలో కొన్ని అవయవాలు కీలకంగా పనిచేస్తాయి. వాటిలో మూత్రపిండాలు ప్రాముఖ్యమైనవి. మూత్రాన్ని ఎప్పటికప్పుడు మూత్రాశయం ద్వారా బయటకు వెళ్ళేలా చేస్తాయి. అయితే చాలా మంది మూత్రం వస్తున్నప్పటికీ వాటిని విసర్జన చేయకుండా ఎక్కువ సేపు కాలయాన చేస్తుంటారు. ఇలా చేయటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రాశయం నిండినప్పుడు మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇలా చేయటం వల్ల శరీరంలోని పెల్విక్ ఫ్లోర్ దెబ్బతిని మూత్రశాయ కండరాలు సంకోచించే సామర్ధ్యం దెబ్బతింటుంది. అదే క్రమంలో మనం చేసే పొరపాటు వల్ల మూత్రం వస్తున్నప్పటికీ మూత్రం బయటకు రావటం లో ఇబ్బందులు ఎదురవుతాయి. మూత్రాన్ని ఎక్కువసేపు అలాగే ఆపుకోని ఉంచటం వల్ల హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీని వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి. దీంతో మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.

తరచుగా మూత్రవిసర్జన చేయడంతో పాటు, ఆల్కహాల్ మూత్రాశయాన్ని కూడా దెబ్బతీస్తుంది. శరీరంలో పెల్విక్ ఫ్లోర్ బలహీనమైతే మనం ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సిన పరిస్ధితులు ఎదురవుతాయి. అలా కాకుండా ఉండాలంటే మూత్ర విసర్జన చేయాలన్న సంకేతం మెదడుకు అందిన వెంటనే మూత్రాన్ని ఆపుకోకుండా వెంటనే విసర్జన చేయాలి. దీని వల్ల మూత్రాశయ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు సకాలంలో వైద్యులను సంప్రదించి తగిని చికిత్స పొందటం మంచిది.