AUS vs ENG : జాకెబ్ బెథెల్ సెంచ‌రీ.. గ‌త 33 ఏళ్ల‌లో యాషెస్‌లో ఇదే తొలిసారి!

సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో (AUS vs ENG) ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జాకెబ్ బెథెల్ సెంచ‌రీ చేశాడు.

AUS vs ENG : జాకెబ్ బెథెల్ సెంచ‌రీ.. గ‌త 33 ఏళ్ల‌లో యాషెస్‌లో ఇదే తొలిసారి!

Jacob Bethell creates history in Ashes First time in 33 years

Updated On : January 7, 2026 / 12:12 PM IST

AUS vs ENG : సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జాకెబ్ బెథెల్ సెంచ‌రీ చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన బెథెల్ ఎంతో ప్ర‌శాంతంగా ఆడుతూ త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌డుతున్నాడు. టెస్టు కెరీర్‌లో అత‌డికి ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం విశేషం. అంతేకాదండోయ్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ అత‌డికి ఇదే తొలి శ‌త‌కం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో గ‌త 33 ఏళ్ల యాషెస్ సిరీస్‌లో ఈ విధ‌మైన ఘ‌న‌తను సొంతం చేసుకున్న తొలి బ్యాట‌ర్ ఇత‌డే.

1993లో ఆస్ట్రేలియా ఆట‌గాడు ఇయాన్ హీలీ ఈ విధ‌మైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. 1989లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జాక్ రస్సెల్ చేసిన తర్వాత యాషెస్‌లో రెడ్-బాల్ క్రికెట్‌లో తన తొలి సెంచరీ నమోదు చేసిన రెండవ ఇంగ్లాండ్ ఆటగాడు బెథెల్.

Rohit Sharma : రోహిత్ భ‌య్యా.. వ‌డాపావ్ కావాలా..? హిట్‌మ్యాన్ ఆన్స‌ర్ అదుర్స్..

ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ (AUS vs ENG) టెస్టుల్లో మెయిడెన్ ఫ‌స్ట్ క్లాస్ సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్లు..

* చార్లెస్ బానర్‌మాన్ (ఆస్ట్రేలియా) – 1877లో మెల్‌బోర్న్‌లో
* బిల్లీ ముర్డోక్ (ఆస్ట్రేలియా) – 1880లో ది ఓవల్‌లో
* పెర్సీ మెక్‌డోనెల్ (ఆస్ట్రేలియా) – 1882లో సిడ్నీలో
* హ్యారీ గ్రాహం (ఆస్ట్రేలియా) – 1893లో లార్డ్స్ లో
* జాక్ రస్సెల్ (ఇంగ్లాండ్‌) – 1989లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో
* ఇయాన్ హీలీ (ఆస్ట్రేలియా) – 1993లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో
* జాకబ్ బెథెల్ (ఇంగ్లాండ్‌) – 2026లో సిడ్నీలో

మొత్తం మీద టెస్ట్ మ్యాచ్‌లో తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించిన ఐదో ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్. హెన్రీ వుడ్, జాక్ రస్సెల్, స్టువర్ట్ బ్రాడ్, గస్ అట్కిన్సన్ అత‌డి కన్నా ముందు ఈ ఘ‌న‌త సాధించారు.

Faf du Plessis : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన‌ ఫాఫ్ డుప్లెసిస్.. ఒకే ఒక సౌతాఫ్రికా ఆట‌గాడు

టెస్టుల్లో తొలి ఫ‌స్ట్ క్లాస్ సెంచరీ సాధించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు వీరే..

* హెన్రీ వుడ్ – సౌతాఫ్రికా పై 1892లో (కేప్ టౌన్)
* జాక్ రస్సెల్ – ఆస్ట్రేలియాపై 1989లో (ఓల్డ్ ట్రాఫోర్డ్)
* స్టువర్ట్ బ్రాడ్ – పాకిస్తాన్ పై 2010లో ( లార్డ్స్ లో)
* గస్ అట్కిన్సన్ – శ్రీలంక‌పై 2024లో (లార్డ్స్)
* జాకబ్ బెథెల్ – ఆస్ట్రేలియా పై 2026లో (సిడ్నీ)