Faf du Plessis : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఫాఫ్ డుప్లెసిస్.. ఒకే ఒక సౌతాఫ్రికా ఆటగాడు
టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) అరుదైన ఘనత సాధించాడు
Faf du Plessis Creates History Becomes First South Africa Player To Stunning Feat(Pic credit @JSKSA20)
- టీ20 క్రికెట్‌లో ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత
- 12 వేల పరుగుల మైలురాయి
- ఏకైక దక్షిణాఫ్రికా ఆటగాడు
Faf du Plessis: టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అతడు ఈఘనతను అందుకున్నాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్న డుప్లెసిస్ (Faf du Plessis ) మంగళవారం ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
Last name Ever. 💛
First name Greatest. 🦁12K runs and counting… 💪#MICTvJSK #WhistleForJoburg pic.twitter.com/by0Ps4ZDOJ
— Joburg Super Kings (@JSKSA20) January 6, 2026
41 ఏళ్ల డుప్లెసిస్ 429 ఇన్నింగ్స్‌లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వీరే..
* ఫాఫ్ డు ప్లెసిస్ – 429 ఇన్నింగ్స్‌లలో 12001 పరుగులు*
* క్వింటన్ డికాక్ – 408 ఇన్నింగ్స్‌లలో 11813 పరుగులు
* డేవిడ్ మిల్లర్ – 496 ఇన్నింగ్స్‌లలో 11631 పరుగులు
* రిలీ రూసో – 375 ఇన్నింగ్స్‌లలో 9705 పరుగులు
* ఏబీ డివిలియర్స్- 320 ఇన్నింగ్స్‌లలో 9424 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్ (44; 21 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఎంఐ బౌలర్లలో కార్బిన్ బోష్ మూడు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదే.. వామ్మో 31 ఏళ్ల ఆటగాడికి చోటు..
అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ కేప్‌టౌన్ 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఎంఐ బ్యాటర్లలో రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (35; 24 బంతుల్లో 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (33; 15 బంతుల్లో 5 సిక్సర్లు), జాసన్ స్మిత్ (22; 7 బంతుల్లో 3 సిక్సర్లు) రాణించాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో నాండ్రే బర్గర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
