Faf du Plessis Creates History Becomes First South Africa Player To Stunning Feat(Pic credit @JSKSA20)
Faf du Plessis: టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అతడు ఈఘనతను అందుకున్నాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్న డుప్లెసిస్ (Faf du Plessis ) మంగళవారం ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
Last name Ever. 💛
First name Greatest. 🦁12K runs and counting… 💪#MICTvJSK #WhistleForJoburg pic.twitter.com/by0Ps4ZDOJ
— Joburg Super Kings (@JSKSA20) January 6, 2026
41 ఏళ్ల డుప్లెసిస్ 429 ఇన్నింగ్స్‌లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వీరే..
* ఫాఫ్ డు ప్లెసిస్ – 429 ఇన్నింగ్స్‌లలో 12001 పరుగులు*
* క్వింటన్ డికాక్ – 408 ఇన్నింగ్స్‌లలో 11813 పరుగులు
* డేవిడ్ మిల్లర్ – 496 ఇన్నింగ్స్‌లలో 11631 పరుగులు
* రిలీ రూసో – 375 ఇన్నింగ్స్‌లలో 9705 పరుగులు
* ఏబీ డివిలియర్స్- 320 ఇన్నింగ్స్‌లలో 9424 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్ (44; 21 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఎంఐ బౌలర్లలో కార్బిన్ బోష్ మూడు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదే.. వామ్మో 31 ఏళ్ల ఆటగాడికి చోటు..
అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ కేప్‌టౌన్ 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఎంఐ బ్యాటర్లలో రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (35; 24 బంతుల్లో 3 సిక్సర్లు), నికోలస్ పూరన్ (33; 15 బంతుల్లో 5 సిక్సర్లు), జాసన్ స్మిత్ (22; 7 బంతుల్లో 3 సిక్సర్లు) రాణించాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో నాండ్రే బర్గర్ రెండు వికెట్లు పడగొట్టాడు.