Gutha Sukender Reddy : కవిత రాజీనామా ఆమోదం తరువాత.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక కామెంట్స్
Gutha Sukender Reddy : కవిత చెప్పింది నిజమా కాదా అనే అంశంపై నేను జడ్జిమెంట్ చెప్పలేను. సభ్యులు రాజీనామా చేసేటప్పుడు మాట్లాడే హక్కు ఉంటుంది. చర్చలలో ప్రతిపక్షాలకే సమయం ఎక్కువగా ఇస్తున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Gutha Sukender Reddy
- కవిత ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకుంది
- నా బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను
- సభ్యులు రాజీనామా చేసేటప్పుడు మాట్లాడే హక్కు ఉంటుంది
- కవిత చెప్పింది నిజమా కాదా అనే అంశంపై నేను జడ్జిమెంట్ చెప్పలేను
Gutha Sukender Reddy : తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత రాజీనామాను ఆమోదించారు. కవిత రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కవిత రాజీనామా ఆమోదంపై కీలక కామెంట్స్ చేశారు.
Also Read : IBomma Ravi : ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం
మీడియాతో చిట్‌చాట్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు.. కవిత ఎమోషనల్ గా నిర్ణయం తీసుకుంది. నా బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను. మొదటిసారి కవిత తన పీఏతో రాజీనామా పత్రం పంపించారు. మొన్న కవిత నేరుగా వచ్చి రాజీనామా ఇచ్చారు. రాజీనామాకు కారణాలను కవిత చెప్పారు. శాసన సభలోనూ కవిత మాట్లాడుతూ తన రాజీనామాను ఆమోదించాలని కోరారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
కవిత చెప్పింది నిజమా కాదా అనే అంశంపై నేను జడ్జిమెంట్ చెప్పలేను. సభ్యులు రాజీనామా చేసేటప్పుడు మాట్లాడే హక్కు ఉంటుంది. చర్చలలో ప్రతిపక్షాలకే సమయం ఎక్కువగా ఇస్తున్నామని గుత్తా అన్నారు. భాష విషయంలో సభ్యులు కంట్రోల్ లో ఉండటం మంచిది. మంచి భాషను ప్రజలకు అందించాలి. భాష ఎంత బాగుంటే అంత గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు.
కవిత రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక జరగదు. తెలంగాణ కొత్త పార్టీ ఆశ్యకత లేదు. పార్టీ పెట్టడం, పార్టీ నడపడం చాలా కష్టమని గుత్తా అన్నారు.
కాగా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజమాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి 2021లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అయితే, బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. పలు సందర్భాల్లో తన రాజీనామాను ఆమోదించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే, సోమవారం తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ శాసనమండలి వేదికగా చైర్మన్ కు కవిత విజ్ఞప్తి చేశారు. దీంతో మండలి చైర్మన్ కవిత రాజీనామాను ఆమోదిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
