Best Phones 2026 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ జనవరిలో రూ. 10వేల లోపు 5 బెస్ట్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు!
Best Phones 2026 : రూ. 10వేల కన్నా తక్కువ ధరలో 5 స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లలో డిస్‌ప్లే, ప్రాసెసర్‌లు, ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Best Phones 2026 (Image Credit To Original Source)
- రూ. 10వేల లోపు ధరలో 5 అద్భుతమైన ఫోన్‌లు
- శాంసంగ్ గెలాక్సీ M06, టెక్నో స్పార్క్ 30C,పోకో M7, లావా స్ట్రోమ్ లైట్, రెడ్‌మి A4
- తక్కువ బడ్జెట్ యూజర్లు తప్పక కొనాల్సిన ఫోన్లు
- ధర, ఫీచర్లు, స్పెషిఫికేషన్ల పూర్తి వివరాలు
Best Phones 2026 : తక్కువ బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? ఫీచర్ల విషయంలో అసలు కాంప్రమైజ్ అవసరమే లేదు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. 2026లో అదిరిపోయే స్పెసిఫికేషన్‌లతో ఫోన్ కొనాలనుకుంటే రూ. 10వేల లోపు 5 అద్భుతమైన ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఈ లిస్టులో శాంసంగ్ గెలాక్సీ M06, టెక్నో స్పార్క్ 30C, పోకో M7, లావా స్ట్రోమ్ లైట్, రెడ్‌మి A4 మోడళ్లు ఉన్నాయి. ప్రతి మోడల్ డిస్‌ప్లే క్వాలిటీ, ప్రాసెసింగ్ కెపాసిటీ, కెమెరా సెటప్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. తక్కువ బడ్జెట్ యూజర్లకు అద్భుతమైన ఫోన్లుగా చెప్పవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M06 (రూ. 9,999) :
శాంసంగ్ గెలాక్సీ M06 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల పీఎల్ఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్, 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 8MP సెల్ఫీ యూనిట్‌తో పాటు బ్యాక్ సైడ్ 50MP + ఆక్సిలరీ లెన్స్ డ్యూయల్ కెమెరా కూడా ఉంది.
Read Also : Xiaomi 14 Civi : బిగ్ డిస్కౌంట్ భయ్యా.. షావోమీ 14 Civi భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
టెక్నో స్పార్క్ 30C (రూ. 9,999) :
టెక్నో స్పార్క్ 30C ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్ అందిస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ కూడా ఉంది. కెమెరా సెటప్‌లో బ్యాక్ సైడ్ 50MP+ ఆక్సిలరీ లెన్స్ కాన్ఫిగరేషన్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ లెన్స్ ఉన్నాయి.

Best Phones 2026 (Image Credit To Original Source)
పోకో M7 (రూ. 9,999) :
స్మార్ట్ విజువల్స్ కోసం పోకో M7 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తోంది. భారీ 6.88-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 18W ఛార్జింగ్ వేగంతో 5160mAh బ్యాటరీని అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. సింగిల్ 50MP బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.
లావా స్టార్మ్ లైట్ (రూ. 8,999) :
మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో లావా స్టార్మ్ లైట్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.75-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. సింగిల్ 50MP బ్యాక్ సెటప్ 5MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది.
రెడ్‌మి A4 (రూ. 8,799) :
షావోమీ రెడ్‌మి A4 ఫోన్ 6.88-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌తో వస్తుంది. రెస్పాన్సివ్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. క్వాల్‌కామ్ SM4635 స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. 18W ఛార్జింగ్ సామర్థ్యంతో 5160mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా వారీగా బ్యాక్ సైడ్ 50MP+ అసిస్టెన్స్ లెన్స్ డ్యూయల్ అరేంజ్‌మెంట్ 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
