Aadhaar PVC Card : బిగ్ అలర్ట్.. ఆధార్ PVC కార్డు ఫీజులు పెరిగాయి.. ఇకపై ఆధార్ అప్‌డేట్ చేస్తే ఎంత చెల్లించాలంటే?
Aadhaar PVC Card : ఆధార్ పీవీసీ కార్డు ధరలు పెరిగాయి. జనవరి 2026 నుంచి ఆధార్ కార్డు అప్‌డేట్స్ ఫీజులను పెంచింది. కొత్త ఫీజుల వివరాలపై ఓసారి లుక్కేయండి.

Aadhaar PVC Card : ఆధార్ కార్డుదారులకు బిగ్ న్యూస్.. మీకు ఆధార్ PVC కార్డు ఉందా? ఆధార్ పీవీసీ కార్డు తీసుకోవాలని చూస్తుంటే ఇది మీకోసమే.. 2026 జనవరి నుంచి పీవీసీ కార్డు ఫీజులను యూఐడీఏఐ పెంచేసింది.

సాధారణంగా ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే కాదు.. బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు, ఇతర ముఖ్యమైన సేవలకు తప్పనిసరి. అందుకే ఈ కార్డును ఎక్కువకాలం మన్నికగా ఉండేందుకు యూఐడీఏఐ పీవీసీ ఆధార్ కార్డును ప్రవేశపెట్టింది.

ఈ కొత్త కార్డు నార్మల్ పేపర్ ఆధార్ కార్డు కన్నా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు కూడా ఆధార్ కార్డులో ఏమైనా అప్ డేట్ చేయాలన్నా లేదా పేరు, అడ్రస్, ఫొటో, పీవీసీ కార్డు కావాలన్నా ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఛార్జీలు చెల్లించాలి. మీరు పీవీసీ ఆధార్ కోసం ఎంత మొత్తంలో చెల్లించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధార్ పీవీసీ కార్డ్ ఛార్జీలివే : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మైఆధార్ (myAadhaar) పోర్టల్ లేదా (mAadhaar) మొబైల్ యాప్ ద్వారా ఆధార్ పీవీసీ కార్డ్ ఛార్జీలను పెంచింది. ఇప్పుడు సవరించిన కొత్త రేట్లు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.

ఆధార్ పీవీసీ కార్డ్ ఏంటి? : ఆధార్ పీవీసీ కార్డ్ అనేది అత్యంత సెక్యూరిటీ ఫీచర్లతో వస్తుంది. ఆధార్ కార్డు పాలీ వినైల్ క్లోరైడ్ అని కూడా అంటారు. ఈ కార్డు ఎక్కువకాలం ఉంటుంది. క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రోటెక్ట్స్, గిల్లోచే (guilloche) ప్యాట్రన్ ఉంటుంది. అందుకే పీవీసీ కార్డు తొందరగా దెబ్బతినదు. క్రెడిట్-కార్డ్ సైజులో ఉంటుంది. ఈ ఆధార్ పీవీసీ కార్డ్ సర్వీస్ ఛార్జీని పన్నులతో కలిపి రూ.50 నుంచి రూ.75కి పెంచారు.

ఆధార్ పీవీసీ కార్డ్ ఛార్జీల పెంపు ఎందుకంటే? : యూఐడీఏఐ (UIDAI) సర్క్యులర్ ప్రకారం.. " కొన్ని ఏళ్లుగా ఆధార్ PVC కార్డుల తయారీకి అధిక ఖర్చు అవుతుంది. కార్డు పంపేందుకు మెటీరియల్స్, ప్రింటింగ్, సేఫ్ డెలివరీ సంబంధిత లాజిస్టిక్స్ ఖర్చు పెరిగింది. దీనికి తగినట్టుగా హై క్వాలిటీ సర్వీసు డెలివరీని అందించేందుకు యూఐడీఏఐ అథారిటీ ప్రస్తుత ఫీజును సవరించాలని నిర్ణయించింది."

ఆధార్ పీవీసీ అసలు ఆధార్ కార్డు కన్నా భిన్నంగా ఉందా? : అలా కాదు. ఆధార్ పీవీసీ కార్డ్ కేవలం ఒక కాంపాక్ట్ వెర్షన్ మాత్రమే. ఇ-ఆధార్ పేపర్ ఆధార్ లెటర్ మాదిరిగానే ఈ పీవీసీ కార్డుకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది.

ఎన్ని రోజుల్లో ఆధార్ PVC కార్డు వస్తుంది? : ఆధార్ నంబర్ హోల్డర్ నుంచి ఆధార్ పీవీసీ కార్డు అప్లయ్ చేసిన తర్వాత యూఐడీఏఐ 5 రోజుల్లోగా ఫ్రింటెడ్ ఆధార్ కార్డును పోస్ట్ చేస్తుంది.

ఆధార్ పీవీసీ కార్డ్ ఇండియా పోస్ట్, స్పీడ్ పోస్ట్ సర్వీస్ ద్వారా ఆధార్ డేటాబేస్‌లో రిజిస్ట్రర్ అయిన అడ్రస్‌కు వస్తుంది. అయితే ప్రస్తుత డెలివరీ నిబంధనలకు అనుగుణంగా డెలివరీ అవుతుంది.
