Robin Uthappa : రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు.. ముంబై, ఢిల్లీ, పంజాబ్ నుంచి వస్తేనే భారత జట్టులో సుస్థిర స్థానం
రాబిన్ ఉతప్ప (Robin Uthappa) తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IND vs NZ ODI series Robin Uthappa Blunt Take On Ruturaj Gaikwad Snub
Robin Uthappa : టీమ్ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ.. ముంబై, ఢిల్లీ, పంజాబ్ నేపథ్యం ఉన్న ఆటగాళ్లకే టీమ్ఇండియాలో సుస్థిర స్థానం ఉంటుందని తెలిపాడు.
జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోనే భారత్ బరిలోకి దిగనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించగా ఇందులో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కు స్థానం దక్కలేదు. అతడు చివరిగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేయడం గమనార్హం.
AUS vs ENG : జాకెబ్ బెథెల్ సెంచరీ.. గత 33 ఏళ్లలో యాషెస్‌లో ఇదే తొలిసారి!
దీనిపైనే రాబిన్ ఉతప్ప స్పందించాడు. రుతురాజ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అతడు దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమేనని అన్నాడు. అయినప్పటికి కూడా అతడు తన హార్డ్ వర్క్‌ను కొనసాగించాలని సూచించాడు. భారత క్రికెట్‌లో ఉన్న సవాళ్లలో ఇది ఒకటన్నాడు. ముంబై, ఢిల్లీ లేదా పంజాబ్ వంటి ప్రధాన క్రికెట్ కేంద్రాల నుంచి రాకపోతే భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి ప్లేయర్లు కష్టపడాల్సి ఉంటుందన్నాడు.
ఇక రుతురాజ్ గైక్వాడ్ 2022లో వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడాడు. 28.50 సగటుతో 228 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్థసెంచరీ ఉంది.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ మంచి ప్రదర్శననే చేశాడు. తొలి మ్యాచ్‌లో 8 పరుగులు మాత్రమే చేసినప్పటికి రెండో వన్డే మ్యాచ్‌లో సెంచరీ (105)తో చెలరేగాడు. ఇక విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
