Narasimha Reunion : నరసింహ రీ యూనియన్.. ఒకే ఫ్రేమ్ లో రజినీకాంత్, రమ్యకృష్ణ.. ఫొటోలు వైరల్..
రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలో ఒకటైన నరసింహ(తమిళ్ లో పడయప్ప) ఇటీవల రీ రిలీజ్ అయి మరోసారి విజయం సాధించింది. దీంతో నరసింహ మూవీ యూనిట్ రజినీకాంత్, రమ్యకృష్ణ, డైరెక్టర్ KS రవికుమార్, నిర్మాత ఒకేచోట కలిశారు. నరసింహ రీ యూనియన్ అంటూ రమ్యకృష్ణ, రజినీకాంత్ ఫోటోలకు పోజులివ్వడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. రజినీకాంత్, రమ్యకృష్ణ, నరసింహ సినిమా ఫ్యాన్స్ ఈ ఫోటోలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.








