Shruthi Haasan : నేను సాయి పల్లవిలా ఉండను.. అందుకే ఆమెలా నటించలేదు..

తాజాగా ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ ఆ సంఘటన గురించి మాట్లాడింది. ఎప్పుడన్నా సినిమా విషయంలో ట్రోలింగ్ కి గురయ్యారా అని అడుగగా శృతి హాసన్ మాట్లాడుతూ..............

Shruthi Haasan :  నేను సాయి పల్లవిలా ఉండను.. అందుకే ఆమెలా నటించలేదు..

Sruthi

 

Shruthi Haasan :  నటనలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేస్తే అందులోని పాత్రలు రీమేక్ సినిమాలో కరెక్ట్ గా చేయకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రియల్ సినిమాలో క్యారెక్టర్ చేసినట్టు రీమేక్ సినిమాలో చేయడానికి ప్రయత్నిస్తారు. అయినా కొన్ని సార్లు ఫెయిల్ అవుతారు. ఇక కొంతమంది అయితే అసలు ఒరిజినల్ సినిమా గురించి ఆలోచించకుండా తమ స్టైల్ లో నటిస్తారు. శృతి హాసన్ ఇదే కోవలోకి వస్తుంది.

శృతి హాసన్ కొన్ని రీమేక్ సినిమాల్లో కూడా చేసింది. అందులో తెలుగు ‘ప్రేమమ్’ ఒకటి. ప్రేమమ్ మలయాళంలో భారీ విజయం సాధించింది. ఆ సినిమాని తెలుగులో నాగ చైతన్య హీరోగా రీమేక్ చేశారు. అయితే అందులో చాలా వరకు అన్ని పాత్రలకి ఒరిజినల్ లో యాక్ట్ చేసిన వాళ్లనే తీసుకున్నా సాయి పల్లవి నటించిన క్యారెక్టర్ కి మాత్రం శృతిహాసన్ ని తీసుకోవడం విశేషం. దీంతో శృతిహాసన్ సాయి పల్లవిలా మెప్పించలేకపోయిందని చాలా విమర్శలు వచ్చాయి. శృతి హాసన్ ని బాగా ట్రోలింగ్ కూడా చేశారు.

Keerthi Suresh : ‘గాంధారి’గా కీర్తి సురేష్.. రేపే విడుదల..

తాజాగా ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ ఆ సంఘటన గురించి మాట్లాడింది. ఎప్పుడన్నా సినిమా విషయంలో ట్రోలింగ్ కి గురయ్యారా అని అడుగగా శృతి హాసన్ మాట్లాడుతూ..” సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత పొగడ్తలు, తిట్లు రెండూ వస్తాయి. నేను ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నింటితో పోలిస్తే ‘ప్రేమమ్‌’ సినిమాకి ఎక్కువ ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాను. ప్రేమమ్ సినిమాలో నా నటన ఏం బాలేదని, హీరో కంటే నేనే పెద్దదానిలా కనిపిస్తున్నాని అన్నారు. ‘ప్రేమమ్‌’ ఆఫర్‌ వచ్చినప్పుడు నేనూ చేయకూడదనే అనుకున్నా. కానీ తర్వాత నా స్టైల్‌లో ఆ పాత్రని క్రియేట్‌ చేయాలని అనుకున్నా. ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదు అనుకోని ఆ ప్రాజెక్ట్ చేశాను. నాకు కూడా ‘ప్రేమమ్‌’ ఒరిజినల్‌ చాలా బాగా నచ్చింది. నేను సాయిపల్లవిలా ఉండను కాబట్టే నేను ఆమెలా నటించలేదు. అదృష్టం కొద్ది మా సినిమా హిట్‌ అయ్యింది. అప్పుడు నేనెంతో ఆనందించాను” అని తెలిపింది.