Mahesh Babu Family : ఇట్స్ ఫ్యామిలీ టైం..

మహేష్ కుటుంబంతో పాటు నమ్రత సోదరి, ఒకప్పటి హీరోయిన్ శిల్పా శిరోద్కర్ ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్‌లో జాయిన్ అయ్యారు..

Mahesh Babu Family : ఇట్స్ ఫ్యామిలీ టైం..

Mahesh Babu Family

Updated On : August 14, 2021 / 12:11 PM IST

Mahesh Babu Family: సూపర్‌స్టార్ మహేష్ బాబు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారు. షూటింగ్‌కి గ్యాప్ వచ్చినా లేకపోతే ఆయన బ్రేక్ తీసుకుని మరీ భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు.

రీసెంట్‌గా ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేశారు మహేష్. ఎప్పటిలా విదేశాలకు కాకుండా ఈసారి గోవాలో ఎంజాయ్ చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు. స్పెషల్ ఫ్లైట్‌లో మహేష్ ఫ్యామిలీతో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

మహేష్ కుటుంబంతో పాటు నమ్రత సోదరి, ఒకప్పటి హీరోయిన్ శిల్పా శిరోద్కర్ ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్‌లో జాయిన్ అయ్యారు. కొద్దిరోజులు గోవా అందాలను ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి ‘సర్కారు వారి పాట’ షూటింగులో జాయిన్ కానున్నారు మహేష్.

సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘బర్త్‌డే బ్లాస్టర్’ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మహేష్ కెరీర్లో మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా లెవల్లో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కనుంది. 2022 సంక్రాంతి కానుకగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.