Minister talasani: కరెంట్ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారు?

పక్క రాష్ట్రంలో కరెంట్ లేదంటూ, రోడ్లు సరిగా లేవంటూ శుక్రవారం ఓ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలను...

Minister talasani: కరెంట్ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారు?

Talasani Srinivsas

Minister talasani: పక్క రాష్ట్రంలో కరెంట్ లేదంటూ, రోడ్లు సరిగా లేవంటూ శుక్రవారం ఓ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలను పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఖండించారు. ఈ క్రమంలో వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కరెంటే లేదని వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ నేతలు కరెంట్ బిల్లు కట్టలేదనుకుంటా అంటూ బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటామాటా పెరుగుతున్న క్రమంలో నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందని అందరూభావించారు. కానీ శనివారం బొత్సవాఖ్యాలకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.

Perni Nani Slams KTR : జగన్ మా సీఎం అయితే బాగుంటుందని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు- కేటీఆర్‌కు పేర్ని నాని కౌంటర్

మంత్రి తలసాని మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కరెంట్ లేదనడంలో అర్థం లేదని తలసాని మండిపడ్డారు. కరెంట్ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారని నిలదీశారు. ఏపీ నేతలు తొందరపాటు వ్యాఖ్యలు చేస్తున్నారని, కోతలు లేని విద్యుత్, మౌలిక వసతుల కల్పన వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయని తలసాని అన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం కేటీఆర్ వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ క్రమంలో ఆయన ఆంధ్ర – తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు.

KTR Comments : డేట్, టైమ్ చెప్పు కేటీఆర్!.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా

ఏపీ రోడ్ల దుస్థితి, తమిళనాడు రోడ్లను వీడియో ఆధారాలతో సహా వివరించారు. ఏపీలో రోడ్లు గుంతల మయంగా ఉన్నాయని, పక్కరాష్ట్రం రహదారులు చక్కగా ఉన్నాయన్నారు. నగరి మండలంలో తన స్వగ్రామమైన అయనంబాకం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని నారాయణ పేర్కొన్నారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలను సీపీఐ ఏపీ నేత రామకష్ణ సమర్థించారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఇప్పటి నుంచి రోడ్లు, నీరు, విద్యుత్ సరఫరాపై దృష్టిసారించాలని హితవు పలికారు. ఇలా కేటీఆర్ వ్యాఖ్యలను వైసీపీ ఖండిస్తుండగా, ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.