Tamannaah : అభిమాని చేతిపై తమన్నా టాటూ.. ఎమోషనల్ అయిన తమన్నా..

తమన్నాకి సౌత్, బాలీవుడ్ లో రెండు చోట్ల అభిమానులు భారీగానే ఉన్నారు. తాజాగా ఓ అభిమాని తమన్నాని కలిసిన వీడియో వైరల్ అవుతుంది.

Tamannaah : అభిమాని చేతిపై తమన్నా టాటూ.. ఎమోషనల్ అయిన తమన్నా..

Tamannaah fan with tattoo on his hand Tamannaah got emotional

Updated On : June 27, 2023 / 10:02 AM IST

Tamannaah Tattoo  :  తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా వరుసగా సినిమాలు చేస్తుంది. సౌత్ లో ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు కూడా సౌత్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. ఇన్నాళ్లయినా ఇప్పటికి కూడా తమన్నా చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే మాములు విషయం కాదు. సినిమాలే కాకుండా మరోపక్క యాడ్స్ తో కూడా ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే జీ కర్దా సిరీస్ లో రెచ్చిపోయి బోల్డ్ గా నటించింది. ఇక తమన్నా నటించిన బోల్డ్ మూవీ లస్ట్ స్టోరీస్ జూన్ 29న విడుదల కానుంది.

తమన్నాకి అభిమానులు ఎక్కువే. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. తమన్నాకి సౌత్, బాలీవుడ్ లో రెండు చోట్ల అభిమానులు భారీగానే ఉన్నారు. తాజాగా ఓ అభిమాని తమన్నాని కలిసిన వీడియో వైరల్ అవుతుంది. తమన్నా ముంబైలో ఓ మాల్ కి వెళ్లగా పార్కింగ్ ప్లేస్ లో ఆమెతో ఫోటోల కోసం అభిమానులు ఎగబడ్డారు.

Akhil : ఏజెంట్ పోయినా.. అఖిల్ నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ భారీ బడ్జెట్‌తోనే.. టైటిల్ అదేనా?

ఈ సమయంలో ఓ అభిమాని వచ్చి తన చేతిపై ఉన్న తమన్నా టాటూని చూపించాడు. తమన్నా ఫేస్ ని టాటూగా వేయించుకున్నాడు, దాంతో పాటు లవ్ యు తమన్నా అని కూడా రాసుకున్నాడు. దీంతో ఆ టాటూ చూసి తమన్నా ఎమోషనల్ అయింది. ఆ అభిమాని తమన్నా కాళ్ళకి నమస్కారం పెట్టడంతో అతన్ని దగ్గరకు తీసుకొని హత్తుకుంది. తమన్నా ఎమోషనల్ అయి అతనికి చాలా సార్లు థ్యాంక్స్ చెప్పింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. గతంలోనూ పలువురు అభిమానులు వాళ్ళ హీరో, హీరోయిన్స్ ఫోటోలను, పేర్లను టాటూలుగా వేయించుకున్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)