Tamil Nadu : ఆలయాల్లో ఇక మహిళా పూజారులు

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిరాగానే..సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు సీఎం స్టాలిన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనేందుకు ఒక్కొక్కటిగా అమలు చేసుకంటూ..తనదైన మార్క్ ను చూపెడుతున్నారు. ఆలయాల్లో మహిళా అర్చకులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.

Tamil Nadu : ఆలయాల్లో ఇక మహిళా పూజారులు

Women Priests  : ఆలయాల్లో మగవారే పూజారులుగా కొనసాగాలా ? ఎందుకు మహిళలు ఈ పని చేయకూడదా ? ఎందుకు చేయవద్దు..ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో మహిళలు పూజారులుగా కొనసాగుతున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిరాగానే..సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు సీఎం స్టాలిన్.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనేందుకు ఒక్కొక్కటిగా అమలు చేసుకంటూ..తనదైన మార్క్ ను చూపెడుతున్నారు. ఆలయాల్లో మహిళా అర్చకులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని దేవాలయాల్లో..తమిళంలో అర్చనలు జరిగే విధంగా చూడాలని, అర్చకత్వంలో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. 100 రోజుల వ్యవధిలో..అర్హతను బట్టి..మహిళలను అర్చకులుగా నియమించడం జరుగుతుందని, ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందన్నారు.

Read:Neelakantapuram : ఆధ్యాత్మికతను పంచండి… గ్రామస్థులకు ఉపరాష్ట్రపతి లేఖ