Vijay : ఆంధ్రప్రదేశ్‌లో విజయ్ లియో షూటింగ్.. ఎక్కడో తెలుసా?
లియో సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. ఇన్నాళ్లు కశ్మీర్, హిమాలయాల్లో లియో సినిమా షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది.

Tamil star hero Vijay leo movie shooting happening in andhrapradesh
Leo Movie Shooting : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఈ సంవత్సరం సంక్రాంతికి వారసుడు సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం విజయ్ తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్నాడు. విజయ్ – లోకేష్ కాంబోలో గతంలో మాస్టర్ సినిమా వచ్చి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్, గౌతమ్ మీనన్.. మరింతమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.
లియో సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. ఇన్నాళ్లు కశ్మీర్, హిమాలయాల్లో లియో సినిమా షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. తిరుపతి దగ్గర్లో ఉన్న తలకోన వాటర్ ఫాల్స్ వద్ద విజయ్ లియో సినిమా షూటింగ్ జరుగుతుంది. విజయ్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో తెలుగు విజయ్ ఫ్యాన్స్, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు విజయ్ ని చూడటానికి భారీగా తరలి వెళ్లారు.
Shahrukh Khan : కూతురితో కలిసి నటించబోతున్న షారుఖ్..??
కారవాన్ నుంచి విజయ్ బయటకు వచ్చి అందరికి హాయ్ చెప్పి షూటింగ్ కి వెళ్లిన విజువల్స్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారాయి. చాలా మంది విజయ్ ఫ్యాన్స్ విజయ్ ని చూడటానికి తలకోన వద్దకు వెళ్లారు. దీంతో భారీగా పోలీసులు షూటింగ్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఏపీలో షూటింగ్ చేస్తుండటంతో తెలుగు విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ సినిమా కావడంతో అభిమానులతో పాటు సినీ ప్రేమికులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
Exclusive: Thalapathy Vijay From #Leo Sets Yesterday. @actorvijay @Jagadishbliss pic.twitter.com/VMGyHcVZba
— #LeoMovie (@LeoMovieOff) June 27, 2023
Thalapathy Vijay Meets his Fans from the sets of #Leo at Talakona Andhra Pradesh. @actorvijay @Dir_Lokesh pic.twitter.com/KX9QNwMilK
— #LeoMovie (@LeoMovieOff) June 26, 2023