Tammareddy Bharadwaj : ‘ప్రాజెక్ట్ K’ వాయిదా పడుతుంది.. మొదటి రోజే 500 కోట్ల కలెక్షన్స్ వస్తాయి..

ప్రభాస్ అభిమానుల్లో ప్రాజెక్ట్ K సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమాపై పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మరిన్ని అంచనాలు పెంచుతున్నారు. తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి ప్రాజెక్ట్ K సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Tammareddy Bharadwaj : ‘ప్రాజెక్ట్ K’ వాయిదా పడుతుంది.. మొదటి రోజే 500 కోట్ల కలెక్షన్స్ వస్తాయి..

Tammareddy Bharadwaj interesting comments on Prabhas Project K Movie

Updated On : June 28, 2023 / 7:25 AM IST

Project K : ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠానితో పాటు కమల్ హాసన్ కూడా నటిస్తున్నారని ఇటీవల ప్రకటించి భారీ అంచనాలని పెంచారు. ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 12 జనవరి 2024 లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఇప్పటికే ప్రభాస్ అభిమానుల్లో ప్రాజెక్ట్ K సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమాపై పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మరిన్ని అంచనాలు పెంచుతున్నారు. తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి ప్రాజెక్ట్ K సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Karthik Varma : విరూపాక్ష డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్, సాయి‌ధరమ్ తేజ్..

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ స్పాట్ కు ఇటీవల ఓ రెండు సార్లు వెళ్ళాను. సినిమా మేకింగ్ చూసి ఆశ్చర్యమేసింది. అదో కొత్త ప్రపంచంలా అనిపించింది. ఇది గ్లోబల్ సినిమా. వరల్డ్ టాప్ 50 సినిమాల్లో ప్రాజెక్ట్ K కచ్చితంగా నిలుస్తుంది. ఇప్పుడు వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటేశాం. ఈ సినిమా 10 వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమాని ప్రపంచమంతా సరిగ్గా ప్రొజెక్ట్ చేస్తే మొదటి రోజే 500 కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ సినిమా సంక్రాతికి విడుదల కాకపోవచ్చు, వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల అవ్వొచ్చు అని అన్నారు.