‘గుర్తుందా శీతాకాలం’ – కీలక పాత్రలో సీనియర్ నటి సుహాసిని..

Suhasini: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా.. ‘గుర్తుందా శీతాకాలం’.. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టేల్’ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి.
ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటణలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ మీద నాగశేఖర్ – భావనరవి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సంయుక్తంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఇండస్ట్రీలో వర్గాల్లోనూ ఈ సినిమా పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సీనియర్ నటి సుహాసిని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లతో కలిసి ఉన్న సుహాసిని పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందీ చిత్రం. త్వరలో టీజర్ విడుదల చెయ్యనున్నారు.