Telangana Lock-down: నేటి నుండి యథావిధిగా బ్యాంకు పనివేళలు!

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం.. రోజువారీ కేసుల నమోదులో కూడా ఘణనీయంగా తగ్గుదల కనిపించడంతో లాక్ డౌన్ అమలులో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 నుండి సాయంత్రం 5 వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం ఈనెల 19 వరకు లాక్ డౌన్ మాత్రం పొడిగించింది.

Telangana Lock-down: నేటి నుండి యథావిధిగా బ్యాంకు పనివేళలు!

Banks Lockdown

Telangana Lock-down: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గడం.. రోజువారీ కేసుల నమోదులో కూడా ఘణనీయంగా తగ్గుదల కనిపించడంతో లాక్ డౌన్ అమలులో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 నుండి సాయంత్రం 5 వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం ఈనెల 19 వరకు లాక్ డౌన్ మాత్రం పొడిగించింది. దీంతో నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు పనివేళలు మళ్ళీ యథావిధిగా మారనున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు పనివేళలు కొనసాగుతాయని ఎస్‌ఎల్‌బీసీ పేర్కొంది.

మేలో తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేసిన నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారుతూ వచ్చాయి. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, జూన్‌ ఒకటో తోదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించాయి. ఈ నెల 10 నుంచి లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని ఎస్‌ఎల్‌బీసీ పేర్కొంది. ఇక, బ్యాంకులతో పాటు దాదాపుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా సాధారణ పనివేళలకు మారనున్నాయి.