Oscar Crisis Team : 94 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో మొదటిసారి.. విల్ స్మిత్ ఘటన వల్లే..
ప్రస్తుతం 95వ ఆస్కార్ వేడుకలు మార్చ్ 12న జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 94 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో మొదటి సారి ఆస్కార్ నిర్వాహకులు క్రైసిస్ టీంని ఏర్పాటు చేశారు. గతేడాది జరిగిన సంఘటన...............

The academy arrange Oscar crisis communications team this year due to last year will smith issue
Oscar Crisis Team : ప్రపంచ సినిమాకు అత్యున్నత పురస్కారం ఆస్కార్. ప్రపంచంలోని ప్రతి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఆస్కార్ వరకూ వెళ్లాలని కళలు కంటారు. ఈ సారి నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో భారతీయులకు 95వ ఆస్కార్ వేడుకలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇక గతేడాది 94వ ఆస్కార్ వేడుకల్లో ఓ అవాంఛనీయయ సంఘటన జరిగిన సంగతి తెలిసిందే.
గతేడాది ఆస్కార్ వేడుకల్లో యాంకర్ క్రిస్ రాక్ సరదాగా మాట్లాడుతూ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న విల్ స్మిత్ భార్యపై సరదాగా జోక్ వేశాడు. దీనిని స్మిత్ సీరియస్ గా తీసుకొని ప్రతిష్టాత్మక వేదికపై క్రిస్ రాక్ చెంప పగలకొట్టాడు. దీంతో ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ ఘటనపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఆస్కార్ కమిటీ విల్ స్మిత్ పై పదేళ్ల వరకూ ఆస్కార్ వేడుకలకు హాజరవ్వకుండా నిషేధించింది.
Nara Lokesh : చిరంజీవి, బాలయ్యపై లోకేష్ వ్యాఖ్యలు.. చిరుకి అభిమానినే కాని..
ప్రస్తుతం 95వ ఆస్కార్ వేడుకలు మార్చ్ 12న జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 94 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో మొదటి సారి ఆస్కార్ నిర్వాహకులు క్రైసిస్ టీంని ఏర్పాటు చేశారు. గతేడాది జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి జరగకూడదని, జరిగితే ఏం చేయాలి అని ఇలా ఒక టీంని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. క్రైసిస్ కమ్యూనికేషన్స్ టీమ్ పేరుతో పలువురు హాలీవుడ్ ప్రముఖులతో ఏర్పాటు చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఈ టీం త్వరగా స్పందిస్తుంది.