Women Order IPhone: ఐఫోన్ ఆర్డ‌ర్ ఇచ్చిన మహిళ.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్!

ఇప్పుడంతా ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్ల ద్వారానే ప్రజల జీవితాలు పెనవేసుకుపోతున్నాయి. ఏ మాత్రం ఫోన్, కంప్యూటర్ పరిజ్ఙానం ఉన్న వారిలో ఎక్కువ మంది ఈ కామర్స్ సైట్ల ద్వారానే కావాల్సిన వస్తువులను కొనుక్కుంటున్నారు.

Women Order IPhone: ఐఫోన్ ఆర్డ‌ర్ ఇచ్చిన మహిళ.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్!

Women Order Iphone

Women Order IPhone: ఇప్పుడంతా ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్ల ద్వారానే ప్రజల జీవితాలు పెనవేసుకుపోతున్నాయి. ఏ మాత్రం ఫోన్, కంప్యూటర్ పరిజ్ఙానం ఉన్న వారిలో ఎక్కువ మంది ఈ కామర్స్ సైట్ల ద్వారానే కావాల్సిన వస్తువులను కొనుక్కుంటున్నారు. అయితే.. అప్పుడప్పుడు ఈ సైట్లలో మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరేదో వస్తువులు రావడం.. కొన్ని సందర్భాలలో అసలు పనికిరాని ఇటుక ముక్కలు, సబ్బులు, బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టెలో పెట్టి వినియోగదారులకు పంపించిన సందర్భాలు వెలుగులోకి వస్తుంటాయి.

బ్రిటన్‌ దేశంలో లంకాషైర్‌కి చెందిన ఓ మహిళ అలానే ఐఫోన్ ఆర్డర్ పెడితే ఓ సైట్ పగిలిపోయిన టైల్స్ ముక్కలను ప్యాక్ చేసి ఆమెకి డెలివరీ ఇచ్చింది. ఒలివియా పార్కిన్‌సన్ అనే మహిళ వర్జిన్ మీడియా అనే ఈ కామర్స్ సైట్ లో ఐఫోన్ 12 ప్రోమాక్స్ (iPhone 12 Pro Max) ఆర్డర్ పెట్టింది. చెప్పినట్లుగా ఈ కామర్స్ సైట్ ఏప్రిల్ 14న ఐటెం డెలివరీ ఇచ్చింది. అయితే పార్సిల్ ఓపెన్ చేసి చూసిన ఒలివియా షాకైంది. అందులో ఫోన్ బదులు విరిగిన టైల్స్ ముక్కలు ఉన్నాయి. దీంతో ఆమె పార్సిల్ డెలివరీ కంపెనీ వర్జిన్ మీడియాకు పరిస్థితి వివరించింది.

https://twitter.com/Ivanbar333/status/1390978077132460033

కానీ సదరు డెలివరీ సంస్థ మాత్రం మీకు టైల్స్ ముక్కలు వచ్చాయంటే మీరు దానికే డబ్బు చెల్లించినట్లు లెక్క అని చెప్పడంతో దాంతో ఆమె న్యాయపోరాటానికి దిగుతానని హెచ్చరించింది. దీంతో వెనక్కు తగ్గిన వర్జిన్ మీడియా మేం దీనిపై దర్యాప్తు చేసి వివరణ ఇస్తామని చెప్పింది. కానీ పది రోజులు గడిచినా సదరు సంస్థ నుండి సమాధానం రాకపోవడంతో ఒలివియా జరిగిన మోసాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఐఫోన్ బదులు తనకు డెలివరీ వచ్చిన టైల్స్ ముక్కలను ఫోటోలు తీసి ట్వీట్స్ చేసింది. దీంతో ఇది వైరల్ కావడంతో చివరికి కంపెనీ దిగొచ్చి తప్పు జరిగిన మాట వాస్తవేమేనని.. అందుకు పరిహారంగా ఆమె చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించింది. కాగా.. ఏదైనా వస్తువు పార్సిల్ ఓపెన్ చేసేప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ ఓపెన్ చేయడం మంచిదని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

Read: Fungi in Mars Photos: మార్స్ మీద ఫంగస్ గుర్తింపు.. పరిశోధకులు ఏమంటున్నారంటే?