Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ లాంచ్.. రాజమండ్రి బ్రిడ్జ్ మీద రచ్చ రచ్చ..
తాజాగా నేడు రాజమండ్రి బ్రిడ్జి మీద టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఇలా రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఓ సినిమా ఈవెంట్ చేయడం ఇదే మొదటిసారి.

Tiger Nageswara Rao First Look launch event on Rajahmundry Bridge
Tiger Nageswara Rao First Look : రవితేజ ఇటీవల వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. త్వరలో రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రాబోతున్నాడు. ఇది రవితేజ మొదటి పాన్ ఇండియా సినిమా. ఒకప్పటి బందిపోటు టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో రవితేజ ఇప్పటివరకు చేయనటువంటి రా అండ్ రస్టిక్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నేడు రాజమండ్రి బ్రిడ్జి మీద టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఇలా రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఓ సినిమా ఈవెంట్ చేయడం ఇదే మొదటిసారి. ఫస్ట్ లుక్ ని యూట్యూబ్, సోషల్ మీడియాలో 3 గంటలకు రిలిజ్ చేస్తామని ప్రకటించినా ఈ ఈవెంట్ లో బ్రిడ్జి మీద నుంచి కింద గోదావరిలోకి ఫస్ట్ లుక్ ఉన్న పెద్ద బ్యానర్ ని వదిలారు. దీంతో బ్యానర్ పై ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.