Urinary Tract Infection : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించే చిట్కాలు!

యూరినరీ ఇన్ఫెక్షన్ వలన పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. లైంగిక సంపర్కం, పేలవమైన పరిశుభ్రత, మూత్రాశయం ఖాళీ చేయడంలో సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్ళు, యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం మొదలైన పరిస్ధితుల్లో యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి.

Urinary Tract Infection : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించే చిట్కాలు!

urinary tract infection

Urinary Tract Infection : హానికరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోని ఏదైనా ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ గురవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ సర్వసాధారణం. యూరినరీ ఇన్ఫెక్షన్ వలన పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, ఎక్కువసార్లు ముత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. లైంగిక సంపర్కం, పేలవమైన పరిశుభ్రత, మూత్రాశయం ఖాళీ చేయడంలో సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్ళు, యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం మొదలైన పరిస్ధితుల్లో యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి. ఇలాంటి పరిస్థితులలో కొన్ని చిట్కాలతో యూరినరీ తగ్గించుకోవచ్చు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ;

ధనియాలు కూడా యూరినరీ ఇన్‌ఫెక్షన్ తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను ధనియాలను వేసి రాత్రంతా నానపెట్టాలి.మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ ధనియాల నీరు తాగడం వలన శరీరంలో పైత్యం కూడా తగ్గుతుంది. ప్రతిరోజూ ఉసిరి రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయలో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రెండు ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేసి అందులో ఒక కప్పు నీటిని పోసి మరల మిక్సీ చేసి వడకట్టుకుని తాగాలి.

బియ్యం నీరు యూరినరీ ఇన్‌ఫెక్షన్ తగ్గించటానికి బాగా ఉపయోగపడతాయు. బియ్యం నీటిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అరకప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీటిని పోసి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత ఒక సారి చేత్తో మొత్తం తిప్పి ఆ నీటిని వడగట్టి తాగాలి .ఇలాగే రోజుకి ఒక గ్లాసు బియ్యం నీరు తాగాలి. అలాగే ధనియాల పొడి, పటిక బెల్లం అనేది మన శరీరానికి బాగా చలువ చేసి ఒంట్లో వున్న వేడిని తగ్గిస్తాయి . ముందుగా స్టౌ మీద గిన్నె పెట్టుకుని నీరు పోసి ఆ నీటిలో మూడు ఒక స్పూన్ల ధనియాల పొడి , పటికబెల్లం, అర స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగించాలి.ఈ డ్రింక్ చల్లారిన తరువాత తాగితే మూత్రంలో వచ్చే మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. నీరు పుష్కలంగా త్రాగాలి. నీరు మూత్ర నాళాల గోడలను శుభ్రపరుస్తుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ప్రాధమిక దశలో ఉనప్పుడే సరైన చికిత్స పొందటం మంచిది. లేకుంటే మూత్రపిండాల సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.