Trivikram: బాలీవుడ్ రాణిని పట్టుకొస్తున్న త్రివిక్రమ్.. నిజమేనా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించేసుకుంది ఈ మూవీ. ఇక రెండో షెడ్యూల్ షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అయ్యాడు.

Trivikram: బాలీవుడ్ రాణిని పట్టుకొస్తున్న త్రివిక్రమ్.. నిజమేనా?

Trivikram To Bring Rani Mukherjee For SSMB28

Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించేసుకుంది ఈ మూవీ. ఇక రెండో షెడ్యూల్ షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అయ్యాడు.

Trivikram: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మరోసారి ఆ కాంబినేషన్ వస్తుందా..?

కాగా, ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ కోసం ఓ అల్టిమేట్ కథను రెడీ చేసిన త్రివిక్రమ్, ఈ సినిమాలోని క్యాస్టింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఏయే పాత్రలకు ఎవరైతే బెస్ట్‌గా సెట్ అవుతారో వారిని ఎలాగైనా తన సినిమాలో తీసుకొచ్చేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉంటుందని, దీని కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీని పట్టుకురాబోతున్నాడనే వార్తి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాణి ముఖర్జీని ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటింపజేయాలని త్రివిక్రమ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. మహేష్‌తో ఫేస్ టు ఫేస్ ఎదురయ్యే సీన్స్ చాలా ఉంటాయని.. అందుకే ఈ పాత్రలో ఓ రిఫ్రెషింగ్ నటి అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. దీనికోసం ఇప్పటికే రాణి ముఖర్జీని సంప్రదించేందుకు రెడీ అవుతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.