Trivikram: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మరోసారి ఆ కాంబినేషన్ వస్తుందా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. హీరోతో సంబంధం లేకుండా, ఆయన సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు వెళ్తుంటారు. అలాంటి డైరెక్టర్‌తో సినిమా చేయాలని పలువురు స్టార్ హీరోలు పోటీ పడుతుంటారు.

Trivikram: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మరోసారి ఆ కాంబినేషన్ వస్తుందా..?

Trivikram To Join Hands Once Again With Allu Arjun

Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆయన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. హీరోతో సంబంధం లేకుండా, ఆయన సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు వెళ్తుంటారు. అలాంటి డైరెక్టర్‌తో సినిమా చేయాలని పలువురు స్టార్ హీరోలు పోటీ పడుతుంటారు. అయితే త్రివిక్రమ్ మాత్రం కొంతమంది హీరోలతో సినిమాలను రిపీట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్స్ అందుకుంటున్నారు. ఈ జాబితాలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నాడు.

Trivikram: మహేష్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ భర్తను పట్టుకొస్తున్న త్రివిక్రమ్..?

వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు రాగా, అవి సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా అల వైకుంఠపురములో మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక వీరిద్దరు మరోసారి చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీతో త్రివిక్రమ్ మరోసారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే బన్నీకి ఆయన ఓ పవర్‌ఫుల్ కథను వినిపించాడని, ఈ సినిమాకు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజం అయితే, బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో రాబోయే నాలుగో సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Trivikram: “చరణ్-బన్నీ”లతో త్రివిక్రమ్ భారీ ముల్టీస్టారర్.. నిజమేనా?

ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అటు త్రివక్రమ్ కూడా తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్టార్ట్ చేశాడు. తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాక, మరోసారి బన్నీ-త్రివిక్రమ్ తమ సినిమాను మొదలుపెడతారని తెలుస్తోంది. ఈ సినిమాను 2023 సమ్మర్ తరువాత స్టార్ట్ చేసి, 2024 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తేలాల్సి ఉంది.