Trivikram: “చరణ్-బన్నీ”లతో త్రివిక్రమ్ భారీ ముల్టీస్టారర్.. నిజమేనా?

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న SSMB29 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంతలో, త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. టాలీవుడ్ మెగా హీరోస్ అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో ఈ డైరెక్టర్ ఒక ముల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Trivikram: “చరణ్-బన్నీ”లతో త్రివిక్రమ్ భారీ ముల్టీస్టారర్.. నిజమేనా?

Trivikram Multistarrer with Ram Charan and Allu Arjun

Updated On : October 24, 2022 / 5:49 PM IST

Trivikram: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న SSMB29 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంతలో, త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. టాలీవుడ్ మెగా హీరోస్ అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో ఈ డైరెక్టర్ ఒక ముల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Allu Aravind: “రామాయణం” కథ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.. అల్లు అరవింద్!

మహేష్ సినిమా తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ఒక కథ సిద్ధం చేశాడట. అయితే నిర్మాతలు చిన్నబాబు, అల్లు అరవింద్ ఆ కథను మల్టీ మల్టీస్టారర్‌గా డెవలప్ చేయమని కోరినట్లు, బన్నీతో పాటు మరో హీరోగా చరణ్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

కాగా ఇటీవల అల్లు అరవింద్ ప్రముఖ టాక్ షోలో రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్‌లతో ఒక మల్టీస్టారర్ తియ్యాలని ఉందని, అందుకోసం “చరణ్-అర్జున్” అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. సరైన దర్శకుడు, కథ కోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు. దీంతో త్రివిక్రమ్ సినిమా వార్తలు నిజమనేలా ఉండడంతో ఫ్యాన్స్ ఆ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.