Producer Natti Kumar: నాడు మా కోసం.. జగన్ ముందు తగ్గారు.. చిరంజీవిపై మాకు పూర్తి నమ్మకం ఉంది- నిర్మాత నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు
గతంలో నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు. కొందరు ఇగోకి వెళ్లారు. (Producer Natti Kumar)

Producer Natti Kumar: సినీ కార్మికుల పంచాయితీ వ్యవహారం క్లైమాక్స్ కు చేరుతోంది. ఇవాళ నిర్మాతలతో చర్చించిన మెగాస్టార్ చిరంజీవి సోమవారం ఫెడరేషన్ తో చర్చించనున్నారు. చిరంజీవితో భేటీ సందర్భంగా తమ సమస్యలను చెప్పుకున్నామని నిర్మాత నట్టికుమార్ తెలిపారు.
మీ సమస్యలు పరిష్కరించేలా తాను చొరవ తీసుకుంటానని చిరంజీవి భరోసా ఇచ్చారని నట్టికుమార్ వెల్లడించారు. గతంలోనూ చిరంజీవి నిర్మాతల కోసం ఓ మెట్టు దిగి వచ్చారని గుర్తు చేశారు.
రేపు సాయంత్రం వరకు సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని నట్టికుమార్ వ్యక్తం చేశారు. త్వరలోనే సినిమా షూటింగ్స్ ప్రారంభం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
”2018లో 25శాతం చిన్న సినిమాలకు తగ్గిస్తామని చెప్పి అమలు చేయలేదు. మీరు ఏ రేట్లను పెంచినా చిన్న సినిమాకు 20శాతం తగ్గించాలని చెప్పాం.
రేపు ఫెడరేషన్ వాదన కూడా వింటానని చిరంజీవి చెప్పారు.
Also Read: ప్రతి కథ హీరోల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. అవార్డులు వద్దు మాకు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు..
ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. గతంలో నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు. కొందరు ఇగోకి వెళ్లారు. అదెక్కడికో వెళ్లింది.
మాకు హామీ ఇచ్చారు. నేను మాట్లాడతానని చెప్పారు.
చిన్న సినిమాలకు ఇబ్బంది లేకుండా చూడాలని చిరంజీవిని కోరాం” అని నిర్మాత నట్టికుమార్ చెప్పారు.
”చిన్న వాళ్లకు న్యాయం చేస్తారని చిరంజీవిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే టికెట్ రేట్లు 5 రూపాయలు అమ్మినప్పుడు, 35 రూపాయలు అమ్మినప్పుడు..
ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాకపోయినా.. చిరంజీవి స్వయంగా వెళ్లారు.. జగన్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. (Producer Natti Kumar)
నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా..
నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా మా ఇండస్ట్రీ కోసం తగ్గుతున్నానని చెప్పారు. చిన్న సినిమా నిర్మాతలకి, పెద్ద వాళ్లకి అందరికీ కలిపి ఒక జీవో తీసుకొచ్చి ఈరోజు సినీ పరిశ్రమను కాపాడింది కూడా చిరంజీవే.(Producer Natti Kumar)
సడెన్ గా షూటింగ్స్ ఆగిపోతే చిన్న సినిమాల నిర్మాతలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో, పెద్ద సినిమాల నిర్మాతలకు కూడా అంతే ఇబ్బంది అవుతుంది. చిరంజీవి మాత్రమే ఇది చేయగలరు. వేరే వాళ్లు చేయలేరు.
దయచేసి చిరంజీవి మా బాధను, కష్టాలను అర్థం చేసుకోమని చెప్పాం. మా బాధలన్నీ ఆయన విన్నారు.
ఇప్పుడీ సమస్య పరిష్కారమై షూటింగ్స్ ప్రారంభమయ్యాక ఆ సమస్యలను కూడా సాల్వ్ చేస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు” అని నిర్మాత నట్టికుమార్ తెలిపారు.
Also Read: అవునా.. నిజమా..? తమిళ్ వాళ్లకు వెయ్యి కోట్ల సినిమా ఎందుకు లేదు? ఈ డైరెక్టర్ చెప్పిన ఆన్సర్ వింటే..
రెండు వారాలుగా సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 30 శాతం వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్ తో కార్మికులు సమ్మెకు దిగారు. అయితే అందుకు నిర్మాతలు ససేమిరా అంటున్నారు. దీనిపై పలు దఫాలుగా ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి.