UP: పేదరికంలోను..శిశుమరణాల్లో టాప్‌-3లో యూపీ..ఇది యోగి పాలన అంటూ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు

పేదరికంలోను..శిశుమరణాల్లో టాప్‌-3లో యూపీ..ఇది యోగి పాలన అంటూ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు వేశారు.

UP: పేదరికంలోను..శిశుమరణాల్లో టాప్‌-3లో యూపీ..ఇది యోగి పాలన అంటూ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు

Up Among 3 Poorest States As Per Niti Aayog's

‘UP among 3 poorest states as per Niti Aayog’s : ఉత్తరప్రదేశ్. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం. తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూపీలో బీజేపీయే అధికారంలోకి వచ్చింది. యూపీలో అభివృద్ధి చేశాం అని చెప్పుకునే బీజేపీ దేంట్లోనో అన్నది తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక చూస్తే ప్రశ్నించుకోవాల్సిందేననిపిస్తోంది. ఎందుకంటే దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో యూపీ మూడో స్థానంలో ఉంది అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొంది. యూపీలో ఉన్నది పేదరికం ఒక్కటే కాదు. శిశుమరణాలు, పిల్లల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగానూ, గర్భిణులకు సరైన ఆరోగ్య సేవలు అందని రాష్ట్రంగానూ యూపీ నిలిచింది అని నీతి ఆయోగ్ 2021 నవంబర్ లో  వెల్లడించింది. దానికి సంబంధించిన పేపర్ క్లిప్ ను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇదీ సీఎం యోగీ పాలన అంటూ సెటైర్లు వేశారు.

కాగా..దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో యూపీ మూడో స్థానంలో ఉందని నీతిఆయోగ్‌ మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ (MPI) నివేదిక వెల్లడించింది. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో మొదటిస్థానంలో బీహార్‌, రెండో స్థానంలో జార్ఖండ్‌ ఉంది. శిశుమరణాలు, పిల్లల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగానూ, గర్భిణులకు సరైన ఆరోగ్య సేవలు అందని రాష్ట్రంగా యూపీ ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఇలా నాలుగు పెరామీటర్లలో యూపీ ఉంది.

ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనీషియేటివ్‌, యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం సంయుక్తంగా రూపొందించిన పద్ధతినే ఎంపీఐ మదింపునకు ఉపయోగించినట్టు నీతిఆయోగ్‌ తన నివేదికలో వెల్లడించింది. బీజేపీ చెబుతున్నట్టు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో రాష్ర్టాలకు ఒరిగేదేమీ లేదని నీతిఆయోగ్‌ నివేదికతో రుజువవుతోంది అని అర్థం చేసుకోవాలి.

కాగా నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదికలోమొదటిస్థానంలో బీహార్‌, రెండో స్థానంలో జార్ఖండ్‌, మూడో స్థానంలో యూపీ ఉండగా..కేరళ, గోవాల్లో పేదరికం తక్కువగా ఉందని తెలిపింది. ఇండెక్స్ ప్రకారం..బీహార్‌లో 51.91 శాతం మంది పేదలు, జార్ఖండ్‌లో 42.16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.79 శాతం ఉన్నారు. ఇండెక్స్‌లో మధ్యప్రదేశ్ (36.65 శాతం) నాలుగో స్థానంలో ఉండగా, మేఘాలయ (32.67 శాతం) ఐదో స్థానంలో ఉంది.కేరళ (0.71 శాతం), గోవా (3.76 శాతం), సిక్కిం (3.82 శాతం), తమిళనాడు (4.89 శాతం), పంజాబ్ (5.59 శాతం) భారతదేశం అంతటా అత్యల్ప పేదరికాన్ని నమోదు చేసి సూచికలో దిగువన ఉన్నాయి.

కేంద్రపాలిత ప్రాంతాలలో (UTలు), దాద్రా, నగర్ హవేలీ (27.36 శాతం), జమ్మూ & కాశ్మీర్, లడఖ్ (12.58), డామన్ & డయ్యూ (6.82 శాతం) మరియు చండీగఢ్ (5.97 శాతం) పేద UTలుగా ఉద్భవించాయి. పుదుచ్చేరి జనాభాలో 1.72 శాతం పేదలు కాగా, లక్షద్వీప్ (1.82 శాతం), అండమాన్ & నికోబార్ దీవులు (4.30 శాతం), ఢిల్లీ (4.79 శాతం) మెరుగ్గా ఉన్నాయి అని వెల్లడించింది.

కాగా నీతి ఆయోగ్ విడుదుల చేసిన ఈ నివేదికపై బీజేపీ ప్రభుత్వం (యూపి ప్రభుత్వం)పై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ దేశంలోని అధ్వాన్నమైన రాష్ట్రాలలో ఒకటిగా ఉందని అన్నారు. బీజేపీ పాలనలో నీతి ఆయోగ్ మొదటి MPIలో దేశంలోని మూడు పేద రాష్ట్రాల్లో యూపీ ఒకటి. పోషకాహార లోపం రేటు పరంగా ఇది మూడవ స్థానంలో ఉంది మరియు పిల్లల మరియు కౌమార మరణాల రేటు విభాగంలో, UP మొత్తం దేశంలోనే అధ్వాన్నమైన స్థానానికి చేరుకుంది. ఇవి బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనాలు ‘ అని యాదవ్ ట్వీట్ చేశారు. దేశంలోని అత్యంత పేద రాష్ట్రాల్లో యూపీ ఒకటి అని పేర్కొంటూ వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను కూడా పోస్ట్ చేశారు అఖిలేశ్ యాదవ్.