Bihar: తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో ఆపించేసిన నితీశ్ కుమార్.. కారణం ఏంటంటే?

వ్యవసాయానికి సంబంధించి బిహార్ రాజధాని పాట్నాలో ఉన్న బాపు సబాగార్‌ ఆడిటోరియంలో ‘నాలుగో వ్యవసాయ రోడ్‌మ్యాప్‌’ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం నీతీశ్‌ను ప్రశంసిస్తూ వ్యవసాయ-పారిశ్రామికవేత్త అమిత్‌కుమార్‌ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. అయితే ఆయన ప్రసంగం ప్రారంభం నుంచి ఇంగ్లీషులో సాగుతోంది. అంతే, కొద్దినిమిషాల తర్వాత ముఖ్యమంత్రి ఆయన ప్రసంగాన్ని ఆపారు.

Bihar: తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో ఆపించేసిన నితీశ్ కుమార్.. కారణం ఏంటంటే?

Use of English words irks CM Nitish Kumar at agriculture event

Bihar: బిహార్ రాష్ట్రంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యాపారవేత్త ప్రసంగం చేస్తుండగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడ్డుకున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే, ఆ ప్రసంగంలో సీఎం నితీశ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ప్రసంగం మధ్యలో ఆపేయడానికి గల కారణం సదరు వక్త ఇంగ్లీషులో ప్రసంగిస్తుండడం. వ్యవసాయం గురించి ప్రసంగం చేస్తున్నందున రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా హిందీలో ప్రసంగించాలని నితీశ్ సూచించారు. అయితే ఈ సందర్భంలో తామున్నది ఇంగ్లాండులో కాదంటూ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నితీశ్ సూచన అనంతరం ప్రసంగీకులు హిందీలోనే తమ ఉపన్యాసాల్ని ఇచ్చారు.

UP Budget 2023: మౌలికరంగానికి యోగి సర్కార్ పెద్దపీట.. రూ.6.90 లక్షల కోట్లతో 2023-24 బడ్జెట్

వ్యవసాయానికి సంబంధించి బిహార్ రాజధాని పాట్నాలో ఉన్న బాపు సబాగార్‌ ఆడిటోరియంలో ‘నాలుగో వ్యవసాయ రోడ్‌మ్యాప్‌’ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం నీతీశ్‌ను ప్రశంసిస్తూ వ్యవసాయ-పారిశ్రామికవేత్త అమిత్‌కుమార్‌ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. అయితే ఆయన ప్రసంగం ప్రారంభం నుంచి ఇంగ్లీషులో సాగుతోంది. అంతే, కొద్దినిమిషాల తర్వాత ముఖ్యమంత్రి ఆయన ప్రసంగాన్ని ఆపారు. ‘‘మీరు అతిగా ఇంగ్లీషఉ పదాలు మాట్లాడటం వల్ల నేను మధ్యలో జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఇదేమన్నా ఇంగ్లాండా? మీరు బిహార్‌లో ఎందుకు పని చేస్తున్నట్లు? సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయాన్ని మీరు అభ్యసిస్తున్నారు. గవర్నమెంట్‌ స్కీమ్స్‌ అనే బదులు సర్కారీ యోజన అనలేరా? నేనూ ఆంగ్ల మాధ్యమంలో ఇంజనీరింగ్‌ చదివాను. అది వేరే విషయం. రోజూవారీ కార్యకలాపాలకు ఆ భాషను ఎందుకు ఉపయోగించాలి’’ అని సూచించారు.

Mallikarjun Kharge: 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా ఇక కాంగ్రెస్‭ గెలుపును ఆపలేరట