Jio – Airtel 5G Data Plans : జియో – ఎయిర్‌టెల్ 5G ప్లాన్లు ఇవే.. ఈ ప్లాన్లపై 3GB డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
Jio - Airtel 5G Data Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel 5G) తమ 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ 5G నెట్‌వర్క్‌తో కలిపి 300 కన్నా ఎక్కువ నగరాలకు అందిస్తున్నాయి.

Using Jio or Airtel 5G_ Check out these 3GB data plans for unlimited data benefits
Jio – Airtel 5G Data Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel 5G) తమ 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ 5G నెట్‌వర్క్‌తో కలిపి 300 కన్నా ఎక్కువ నగరాలకు అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్, జియో సర్వీసులతో వేగవంతమైన నెట్‌వర్క్ కనెక్టివిటీని ఉచితంగా అందిస్తున్నాయి. ఇప్పటికే 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగిన యూజర్లు కొత్త 5G SIMను కొనుగోలు చేయకుండానే ఏదైనా టెల్కోల నుంచి 5వ జనరేషన్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయవచ్చు.
ఈ కొత్త 5G నెట్‌వర్క్ మీ యాక్టివ్ డేటా ప్యాక్‌ని మరింత వేగంగా చేసుకోవచ్చు. Jio, Airtel రెండింటి నుంచి 3GB రోజువారీ డేటా ప్యాక్‌లను అందిస్తున్నాయి. 5G వేగాన్ని అందించడమే కాకుండా ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేసేందుకు లేదా స్ట్రీమ్ చేసేందుకు మరింత డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌లలో OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos) లేదా ఇతర OTT ఛానెల్‌ల ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు. 5G స్పీడ్‌తో వీక్షించవచ్చు. పెర్క్‌లతో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, SMS బెనిఫిట్స్ అందించే Jio, Airtel నుంచి 3G రోజువారీ డేటా ప్యాక్‌లను అందిస్తోంది. అవేంటో ఓసారి చూద్దాం..
3G రోజువారీ డేటాతో Jio ప్లాన్ :
రూ. 419 ప్రీపెయిడ్ ప్లాన్ : 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3GB లిమిట్‌తో మొత్తం 84GB డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా వినియోగం తర్వాత యూజర్లు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. 64 Kbps స్పీడ్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, JioTV, JioCinema, JioSecurity, Jio క్లౌడ్‌తో సహా Jio యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నాయి.
రూ. 1199 ప్రీపెయిడ్ ప్లాన్ : Jio ఈ ప్యాక్ కింద 252GB మొత్తం డేటాతో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యూజర్లు 3GB రోజువారీ లిమిట్‌తో అన్‌లిమిటెడ్ హైస్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. వినియోగం తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది. Jio యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లిమిట్ కూడా పొందవచ్చు.

Using Jio or Airtel 5G_ Check out these 3GB data plans for unlimited data benefits
3G రోజువారీ డేటాతో Airtel ప్లాన్ :
రూ. 499 ప్లాన్ : 28 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, 3GB రోజువారీ ఇంటర్నెట్ డేటా ఉన్నాయి. అదనపు బెనిఫిట్స్ పొందాలంటే.. Airtel OTT బెనిఫిట్స్ అందించింది. అనేక సబ్‌స్క్రిప్షన్‌లను యాడ్ చేసింది.
ఎయిర్‌టెల్ యూజర్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కి 3 నెలల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్, Xstream యాప్‌కు 28 రోజుల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్ అపోలో 24|7 సర్కిల్, హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్, ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ.100 క్యాష్‌బ్యాక్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.
రూ. 699 ప్లాన్ : ఈ ప్లాన్ కింద Airtel 3GB రోజువారీ హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను 56 రోజులపాటు అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ విషయానికొస్తే.. ఎయిర్‌టెల్ యూజర్లు Amazon Prime సభ్యత్వానికి 56 రోజుల సభ్యత్వంతో పాటు Xtream యాప్‌కు సభ్యత్వం, Apollo 24|7, HelloTune, Wynk Music, ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ పొందవచ్చు.