Vande Bharat Aluminium Trains : త్వరలో వందేభారత్ స్లీపర్ క్లాస్ ట్రైన్స్..తయారీకి రైల్వే శాఖ టెండర్, బిడ్లు దాఖలు చేసిన ఫ్రాన్స్, స్విస్ సంస్థలు
భారతీయ రైల్వే మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టిన మన రైల్వే.. అంతకుమించిన వేగంతో త్వరలో అల్యూమినియం రైళ్లను ప్రవేశపెట్టనుంది. స్విస్, ప్రాన్స్ దేశాలకు చెందిన సంస్థలు అల్యూమినియం రైళ్ల తయారీకి బిడ్‌లు కూడా సమర్పించాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే.. హైస్పీడ్ రైళ్లలో స్లీపర్ క్లాస్ ప్రయాణం అతిత్వరలో అందుబాటులోకి వచ్చినట్లే..

Vande Bharat Aluminium Ttrains
Vande Bharat Aluminium Trains : భారతీయ రైల్వే మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టిన మన రైల్వే.. అంతకుమించిన వేగంతో త్వరలో అల్యూమినియం రైళ్లను ప్రవేశపెట్టనుంది. స్విస్, ప్రాన్స్ దేశాలకు చెందిన సంస్థలు అల్యూమినియం రైళ్ల తయారీకి బిడ్‌లు కూడా సమర్పించాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే.. హైస్పీడ్ రైళ్లలో స్లీపర్ క్లాస్ ప్రయాణం అతిత్వరలో అందుబాటులోకి వచ్చినట్లే..
హైస్పీడ్ అల్యూమినియం రైళ్ల తయారీకి సిద్ధమవుతోంది రైల్వే. 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే స్లీపర్ క్లాస్ రైళ్లను అందుబాటులోకి తేవాలని వేగంగా అడుగులు వేస్తోంది రైల్వే. ఈ వందే భారత్ అల్యూమినియం రైళ్లు భారతీయ రైల్వేకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయని అంటున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 100 అల్యూమినియం వందే భారత్ రైళ్లను తయారు చేయాలని చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇందుకోసం 30 వేల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. రెండు ప్రధాన రైల్వే పరికరాల తయారీ సంస్థలు – స్విస్ మేజర్ స్టాడ్లర్ మేధా సర్వో, ఫ్రాన్స్‌కు చెందిన ఆల్‌స్టోమ్ సంయుక్తంగా బిడ్‌లను సమర్పించాయి.
వందే భారత్ అల్యూమినియం రైళ్లు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. స్లీపర్ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లు భారతీయ రైల్వే రూపురేఖలను మార్చేస్తాయంటున్నారు. వందే భారత్ రైళ్లు ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్లు, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కంటే మెరుగైనవి. సెమీ హై స్పీడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ వందే భారత్ రైళ్లు గంటకు 160 కి.మీ వేగంతో పరుగులు పెట్టగలవు.
ఇప్పుడు వందేభారత్ 2.0 ప్రాజెక్టులో భాగంగా తీసుకువస్తున్న అల్యూమినియం రైళ్లు స్లీపర్ వెర్షన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు రైల్వే అధికారులు. అంతేకాదు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. వందేభారత్ సెమీ హైస్పీడ్ వెర్షన్‌ను మరింత విస్తరించి.. సకల సౌకర్యాలు ఉండేలా హైస్పీడ్ రైళ్లను తీర్చిదిద్దనున్నారు. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రీమియం వెర్షన్‌గా 200 స్లీపర్ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది రైల్వే.