Vijayashanthi : ‘మా’ ఎన్నికలపై విజయ శాంతి స్పందన..

సీవీయల్ నరసింహ రావు చేసిన వ్యాఖ్యలు సరైనవేనంటూ సీనియర్ నటి, ‘లేడి అమితాబ్’ విజయశాంతి సోషల్ మీడియా ద్వారా స్పందించారు..

Vijayashanthi : ‘మా’ ఎన్నికలపై విజయ శాంతి స్పందన..

Vijayashanthi

Updated On : June 29, 2021 / 4:24 PM IST

Vijayashanthi: 2021 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్షబరిలో ఏకంగా నలుగురు నటీనటులు పోటీపడుతుండడంతో ఈసారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్‌ను ప్రకటించారు.

ప్రకాష్ రాజ్ స్పీడ్‌తో పోలిస్తే.. విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ కాస్త వెనకబడ్డారనే చెప్పాలి. కాగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ‘మా’ ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని కుండ బద్దలుకొట్టినట్టు తెలిపారు. తాజాగా సీవీయల్ నరసింహ రావు చేసిన వ్యాఖ్యలు సరైనవేనంటూ సీనియర్ నటి, ‘లేడి అమితాబ్’ విజయశాంతి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Prakash Raj : పదవుల కోసం కాదు.. పనులు చేయడానికే..

‘‘మా’ ఎన్నికలపై సీవీయల్ నరసింహా రావు ఆవేదన న్యాయమైనది, ధర్మమైంది.. నేను మా సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నా… చిన్న కళాకారుల సంక్షేమం దృష్ట్యా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా’’… అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు విజయశాంతి..