Prakash Raj : పదవుల కోసం కాదు.. పనులు చేయడానికే..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్‌ మరో అడుగు ముందుకేశారు.. తన ప్యానెల్‌లో ఎవరెవరు ఉండబోతున్నారో తెలిపారు..

Prakash Raj : పదవుల కోసం కాదు.. పనులు చేయడానికే..

Prakash Raj Announces His Panel For Maa Elections

Updated On : June 28, 2021 / 11:12 AM IST

Prakash Raj: రసవత్తరంగా మారిన టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్‌ మరో అడుగు ముందుకేశారు.. తన ప్యానెల్‌లో ఎవరెవరు ఉండబోతున్నారో తెలిపారు.. ‘మా’ సినిమా బిడ్డలు వీరే అంటూ లిస్ట్‌ను విడుదల చేశారు ప్రకాష్ రాజ్.. మొత్తం 27 మందితో తన ప్యానల్ ఉంటుందని తెలిపారు..

వీరంతా ‘మా’ శ్రేయస్సు కోసం నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెడతారని.. నటుల బాగోగుల కోసం.. అందరి ఆశీస్సులు, అండదండలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు.. పదవుల కోసం కాదు.. పనులు చేయడానికి మాత్రమే రాబోతున్నామని తెలిపారు..

ప్రకాష్ రాజ్‌ ప్యానెల్‌లో జయసుధ, శ్రీకాంత్‌, బెనర్జీ, సాయికుమార్, తనీష్, అనసూయ, అజయ్‌, నాగినీడు, బ్రహ్మాజీ, సమీర్‌, ఉత్తేజ్‌, బండ్ల గణేష్‌, భూపాల్, టార్జాన్, సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్‌తో పాటు మరికొందరు నటులు ఉన్నారు..