వీళ్ళ మార్గం అనన్యం.. అసామాన్యం..

వీళ్ళ మార్గం అనన్యం.. అసామాన్యం..

Happy Women’s Day: రానా దగ్గుబాటి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’ (రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్).. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Viraata parvam

ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, ప్రోమోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కథానాయిక సాయి పల్లవితో పాటు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్న జరీనా వహాబ్, ఈశ్వరి రావు, నందితా దాస్, ప్రియమణిల పోస్టర్ విడుదల చేశారు.

అలాగే వీరి వ్యక్తిత్యాలు, పాత్రల తాలుకూ వివరాలను, ఆ పాత్రల గొప్పదనాన్ని తెలియజేస్తూ.. రానా వాయిస్ ఓవర్‌తో ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, సాయిచంద్ కీలకపాత్రల్లో నటిస్తున్న ‘విరాట పర్వం’ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.