Vishnu Vishal : గుత్తాజ్వాల – విష్ణు విశాల్‌ పెళ్లి వీడియో

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల...విష్ణు విశాల్ కు సంబంధించిన పెళ్లి వీడియో రిలీజ్ అయ్యింది.

Vishnu Vishal : గుత్తాజ్వాల – విష్ణు విశాల్‌ పెళ్లి వీడియో

Gutta Jwala

Updated On : September 8, 2021 / 1:03 PM IST

Vishnu Vishal Weds Jwala Gutta : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల…విష్ణు విశాల్ కు సంబంధించిన పెళ్లి వీడియో రిలీజ్ అయ్యింది. గుత్తా బర్త్ డే సందర్భంగా…ఈ వీడియోను విష్ణు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో హల్దీ వేడుక, పెళ్లి, రిసెప్షన్ కు సంబంధించినవి ఉన్నాయి. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ…2021, ఏప్రిల్ 22వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఎలాంటి వీడియో బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More : Gutta Jwala – Vishnu Vishal : పెళ్లి పీటలెక్కబోతున్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్..

కరోనా వైరస్ నేపథ్యంలో…నియమ నిబంధనల మధ్య వీరి పెళ్లి జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, కొద్ది మంది అతిథుల మధ్య పెళ్లి ఘనంగా జరిగింది. 2005లో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను గుత్తా జ్వాల వివాహం చేసుకున్నారు. అయితే..కొన్ని కారణాలతో 2011లో వీరిద్దరూ విడిపోయారు. తర్వాత చేతన్ మరో వివాహం చేసుకున్నారు. విశాల్ వివాహం 2011లో తమిళ నటుడు కె.నటరాజన్ కుమార్తె రజినితో జరిగింది. వీరికి ఆర్యన్ బాబు ఉన్నాడు. 2018 సంవత్సరంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే..విష్ణు విశాల్, గుత్తా జ్వాలలు కొద్దికాలం డేటింగ్ లో ఉన్నారు.