Vivo Foldable X Flip : శాంసంగ్‌కు పోటీగా.. వివో నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
Vivo Foldable X Flip : స్మార్ట్‌ఫోన్ మేకర్లు ఫోల్డబుల్ ఫోన్లపై ఫోకస్ పెట్టారు. పోటాపోటీగా గ్లోబల్ మార్కెట్లోకి మడతబెట్టే ఫోన్లను రిలీజ్ చేస్తున్నారు. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌కు పోటీగా వివో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొచ్చింది.

Vivo launches its first compact foldable X Flip phone to take on Samsung Galaxy Z Flip 4
Vivo Foldable X Flip : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్ల (Foldable Phones)ను ప్రవేశపెట్టేందుకు పోటీపడుతున్నాయి. ఇప్పటికే చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజమైన (Oppo Find N Flip), Galaxy Z Flip 4 మాదిరిగానే కాంపాక్ట్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఈ కొత్త ప్రధాన స్మార్ట్‌ఫోన్ (Vivo, Vivo X Flip)గా క్లామ్‌షెల్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. డివైజ్ ముందు భాగంలో కాల్స్, నోటిఫికేషన్ల కోసం మరిన్ని ఫీచర్లను యాక్సస్ చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z Flip 4, Oppo Find N2లోని కెమెరా సిస్టమ్ మాదిరిగానే ప్యానెల్లో రెండు కెమెరాలు ఉన్నాయి. Vivo రెండో జనరేషన్ Vivo X ఫోల్డ్ 2 ఫోల్డబుల్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు చైనీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. అయితే, గ్లోబల్ లభ్యత వివరాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. యూట్యూబ్‌లోని వీడియోలను పరిశీలిస్తే.. Vivo X Fold 2 ప్యాకేజింగ్‌లో ఛార్జర్, ప్రొటెక్టివ్ కేస్ ఉన్నాయని సూచిస్తున్నాయి. శాంసంగ్ Galaxy Z Flip 4 ఫోల్డబుల్ ఫోన్లో మాత్రం ఛార్జర్ లేదు.
Vivo X Flip ధర ఎంతంటే? :
వివో (Vivo X Flip) రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. చైనాలో ఈ ఫోన్ ధర CNY 5,999 నుంచి ప్రారంభమవుతుంది. బేస్ 12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్ దాదాపు రూ.71,600 వరకు ఉంటుంది. 12GB RAM, 512GB స్టోరేజీ ఉన్న టాప్ మోడల్ ధర CNY 6,699 (దాదాపు రూ. 80,000)గా ఉంది. (Samsung Galaxy Z Flip 4) మాదిరిగానే కొత్త Vivo ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ పర్పుల్, బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
Read Also : Xiaomi 12 Pro Sale : రూ. 42,999కే షావోమీ 12ప్రో ఫోన్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!
Vivo X Flip గ్లోబల్ మార్కెట్లో Vivo ఎలాంటి వివరాలను షేర్ చేయలేదు. వివో ఫస్ట్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ (Vivo X Fold)ను చైనా మార్కెట్ కోసం రిజర్వ్ చేసింది. Oppo మొదటి (Oppo Find N)తో 2021లో లాంచ్ చేసింది. ఈ ఏడాదిలో మొదటి ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్ (Oppo Find N Flip)ని Vivo X ఫ్లిప్‌కు పోటీగా రిలీజ్ చేసింది. Vivo ఈ ఏడాది భారత మార్కెట్లో ఫోల్డింగ్ డివైజ్‌లలో ఒకదానిని లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే, ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే. అది జరిగితే.. వివో భారత్‌లో Vivo X90 సిరీస్‌ను త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Vivo launches its first compact foldable X Flip phone to take on Samsung Galaxy Z Flip 4
Vivo X ఫ్లిప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే :
వివో X ఫ్లిప్లోని ఔటర్ డిస్ప్లే (3-అంగుళాల AMOLED స్క్రీన్) ఇతర ఫోన్ల కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ స్క్రీన్ 682×422 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌ను మాత్రమే అందిస్తుంది. ఈ ఫోన్ మడత విప్పితే 6.7-అంగుళాల పొడవైన డిస్ప్లే కలిగి ఉంటుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 2,520×1,080 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. వివో కాంపాక్ట్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, Qualcommతో వస్తుంది. అదే SoC గత ఏడాదిలో (Samsung Galaxy Z Fold 4), Z ఫ్లిప్ 4తో సహా అనేక ఫ్లాగ్‌షిప్‌లకు పవర్ అందిస్తుంది. బయట కెమెరా సిస్టమ్‌లో 50-MP ప్రైమరీ సెన్సార్, 12-MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.
వెనుక కెమెరాలు జీస్‌తో కలిసి ఉన్నాయి. ఇన్నర్ డిస్ప్లే లోపల 32MP సెల్ఫీ కెమెరా ఉంది. అన్ని ఫీచర్లు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీతో వచ్చాయి. మరోవైపు, X ఫోల్డ్ 2 జీస్-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో కూడా వస్తుంది. Vivo X ఫోల్డ్ 2 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,800mAh బ్యాటరీ యూనిట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ధర CNY 8,999 నుంచి మొదలవుతుంది. అదే బేస్ 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర దాదాపు రూ. 1,07,500 నుంచి అందుబాటులో ఉంటుంది.
Read Also : WhatsApp New Features : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. రాబోయే సరికొత్త ఫీచర్లు ఏంటో తెలుసా?