Telangana : వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..మేయర్‌ గుండు సుధారాణికి రూ.2లక్షలు జరిమానా

వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మున్సిపల్ అధికారులు మేయర్‌ గుండు సుధారాణికి రూ.2లక్షలు జరిమానా విధించారు. ఎందుకంటే..

Telangana : వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..మేయర్‌ గుండు సుధారాణికి రూ.2లక్షలు జరిమానా

Rs. 2 Lakh Fine To Mayor Gundu Sudha Rani

Warangal Corporation officials RS. 2 Lakh fine to Mayor Gundu Sudha rani  : టీఆర్ఎస్ నేతలకు వరంగల్ మున్సిపల్ అధికారులు ఝలక్ ఇచ్చారు. వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మున్సిపల్ అధికారులు టీఆర్ఎస్ నేతలకు భారీ జరిమానా విధించి షాక్ ఇచ్చారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా నగరం మొత్తం టీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో మున్సిలప్ అధికారులు కొరడా ఝుళిపించారు.

అనుమతి లేకుండా వరంగల్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వరంగల్ మేయర్ సహా పలువురికి కార్పోరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మేయర్ గుండు సుధారాణికి రూ. 2 లక్షల జరిమానా విధించారు. బుధవారం (ఏప్రిల్ 20,2022)వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని టీఆర్ఎస్ నేతలు కేటీఆర్కు పెద్ద ఎత్తున స్వాగతం తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Also read : TS TRS : రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ కొడతారా? ఆసక్తికరంగా మానకొండూరు రాజకీయం

వరంగల్ కార్పోరేషన్ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని కార్పోరేషన్ అధికారులు చర్యలు తీసుకొన్నారు. మేయర్ గుండు సుధారాణి కూడా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్ని అధికారులు గుర్తించారు.దీంతో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి కార్పోరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు జరిమానా కూడా విధించారు. మేయర్ సుధారాణికి రూ. 2 లక్షల పైన్ చెల్లించాలని కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే టీఆర్ఎస్ నేత ఎంపీ కేశవరావుకి రూ.50వేలు జరిమానా విధించారు.

Also read : Bhatti Vikramarka : భట్టి విక్రమార్క పాదయాత్రలో కండువాల రచ్చ..రానున్న ఎన్నికల్లో పొత్తులపై హాట్ హాట్ చర్చ…

రాష్ట్ర వ్యాప్తంగా పలు స్థానిక సంస్థల్లో కూడా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జరిమానాలు విధించిన సందర్భాలున్నాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా గత ఏడాది అక్టోబర్ మాసంలో నిర్వహించారు. ఎక్కడపడితే అక్కడ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. మంత్రులతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా గతంలో ఫైన్ చెల్లించారు.