Bhatti Vikramarka : భట్టి విక్రమార్క పాదయాత్రలో కండువాల రచ్చ..రానున్న ఎన్నికల్లో పొత్తులపై హాట్ హాట్ చర్చ…

భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆయన మెడలో ఉన్న టీడీపీ, కమ్యూనిస్టు కండువాల గురించి చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పొత్తులపై హాట్ హాట్ చర్చ సాగుతోంది.

Bhatti Vikramarka : భట్టి విక్రమార్క పాదయాత్రలో కండువాల రచ్చ..రానున్న ఎన్నికల్లో పొత్తులపై హాట్ హాట్ చర్చ…

Ts Clp Leader Bhatti Vikramarka ..people's March Padayatra

TS CLP Leader Bhatti Vikramarka  : రాజకీయమంటే.. ఎత్తులు.. పైఎత్తులే కాదు. కొన్ని సార్లు పొత్తులు కూడా ఉంటాయ్. ఉన్నట్టుండి.. పొత్తుల ముచ్చట ఎందుకొచ్చిందనుకోవద్దు. దానికీ.. ఓ రీజన్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌లో దీనిమీదే హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఓ వైపు.. ఏ పార్టీతో పొత్తులు ఉండవని అధిష్టానం చెబుతుంటే.. ఈ రకమైన చర్చ ఎందుకు మొదలైంది? సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రే.. దీనికి కారణమా?

దేశంలోని ఏ పార్టీ రాజకీయమైనా.. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కానీ.. కాంగ్రెస్‌ అలా కాదు. దాని.. రాజకీయ మర్మమే అంతు చిక్కదు. ఆ పార్టీలో లీడర్లంతా.. టీమ్‌తో సంబంధం లేకుండా.. ఎవరికి తోచిన పొలిటికల్ గేమ్ వాళ్లు ఆడేస్తుంటారు. అలాంటి కాంగ్రెస్‌లో.. కొత్తగా ఓ అంశం చర్చనీయాంశమైంది. పార్టీలో.. పీసీసీ చీఫ్ తర్వాత.. మళ్లీ అంతటి స్థాయి పోస్ట్ సీఎల్పీ. అలాంటి.. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరిట.. తన సొంత నియోజకవర్గం మధిరలో పాదయాత్ర చేస్తున్నారు. భట్టి చేస్తున్న ఈ యాత్రకు.. టీడీపీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. దీంతో.. భట్టి కాంగ్రెస్ కండువాతో పాటు పసుపు, ఎర్ర కండువాలు
కూడా వేసుకొని నడిచేస్తున్నారు. మీటర్ కండువాలు.. ఇప్పుడు గాంధీభవన్‌లో. కిలోమీటర్ డిబేట్‌కు దారితీశాయ్.

Also read : Minister KTR: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. గులాబిమయమైన ఓరుగల్లు..

భట్టి విక్రమార్క పాదయాత్రలో కనిపిస్తున్న సన్నివేశాలపై.. కాంగ్రెస్ నేతలు, కేడర్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. భట్టి మెడలో తెలుగుదేశం, వామపక్ష పార్టీల కండువాలు ఉండటంతో.. రాబోయే ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయా? అనే డిబేట్ నడుస్తోంది. భవిష్యత్తులో ఏర్పడబోయే పొత్తులకు.. ఇదేమైనా సంకేతమా అనే ఊహాగానాలు సైతం బలంగా వినిపిస్తున్నాయ్. తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు.. భట్టి పాదయాత్రకు వాళ్లంతట వాళ్లే మద్దతు తెలిపినా.. ఆ పార్టీ కండువాలు కూడా మెడలో వేసుకొని విక్రమార్క నడవడం.. కొత్త రచ్చకు తెరదీసింది.

వచ్చే ఎన్నికల్లో.. ఏ పార్టీతో పొత్తులండవ్.. సింహం సింగిల్‌గా ఫైట్ చేస్తుందని.. అధిష్టానం స్టేట్‌మెంట్స్ ఇస్తుంటే.. భట్టి మాత్రం తన మెడలో టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీల కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ వల్లే.. కాంగ్రెస్ మునిగిపోయిందని.. నేతలు లబోదిబోమని మొత్తుకుంటుంటే.. విక్రమార్క ఇలా ఎందుకు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు.. కమ్యూనిస్ట్ పార్టీలు రాష్ట్రంలో అధికార పార్టీతో దోస్తీ చేస్తుంటే.. భట్టి వారి కండువాలు వేసుకోవడం.. యాత్రలో జెండాలు పట్టుకొని తిరగడమేంటని.. మరో చర్చ నడుస్తోంది.

Also read : Minister KTR: తెలంగాణ స్పేస్ టెక్ ఫ్రేంవర్క్ – 2022 ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

అయితే.. భట్టి ప్రస్తుతం తన సొంత నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. త్వరలోనే.. రాష్ట్రవ్యాప్తంగానూ పాదయాత్ర కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అప్పుడు కూడా.. మిగతా పార్టీల జెండాలు, కండువాలను కప్పుకుంటారా? లేక.. మధిర వరకే పరిమితం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. భట్టి ఎపిసోడ్ తర్వాత.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా .. ఏ పార్టీతో పొత్తులుండవని ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్.. తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు. లేటెస్ట్‌గా.. పీకే కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశం కావడం, కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు హింట్ ఇవ్వడంతో.. ఇక్కడ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పొత్తు చిగురిస్తుందనే చర్చ మొదలైంది.

Also read : సెక్రటేరియట్ అద్భుతంగా తీర్చిదిద్దాలి : సీఎం కేసీఆర్‌

కానీ.. అది జరగని పని అని.. ఇటీవలే ఢిల్లీలో జరిగిన మీటింగ్‌లో.. రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఈ ప్రచారం ఆగడం లేదు. అందుకే.. ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు. తాము.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ట్వీట్ చేయడంతో పాటు తమ ఎజెండాను.. వరంగల్ సభ ద్వారా స్పష్టం చేస్తామన్నారు.