Whooping cough : చిన్నారుల్లో కోరింత దగ్గు సమస్య! దుమ్మూ,ధూళికి దూరంగా ఉండటం మంచిది.

సీజనల్ వైరస్, క్రూప్, ఆస్తమా, న్యుమోనియా వల్ల కోరింత దగ్గు వస్తుంటుంది. పిల్లలలో నిరంతర దగ్గు వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. దగ్గుతోపాటు వాంతులు కూడా సంభవించవచ్చు. రోగి పరి స్థితి ఆందో ళన కరంగా కనిపిస్తుంది. తీవ్రమైన దగ్గు వల్ల కళ్లు ఎరు పెక్కు తాయి. ముక్కు నుంచి రక్తం కారే అవకాశాలున్నాయి.

Whooping cough : చిన్నారుల్లో కోరింత దగ్గు సమస్య! దుమ్మూ,ధూళికి దూరంగా ఉండటం మంచిది.

Whooping cough problem

Whooping cough : చిన్న పిల్లలకు సోకే అంటువ్యాధి కోరింత దగ్గు. ఈ వ్యాధి ప్రారంభంలో ముందుగా జలుబు తో ప్రారంభమై కొద్దిపాటి జ్వరం, దగ్గు ఉంటుంది. రెండునుంచి ఏడేళ్ల లోపు చిన్నారులు కోరింత దగ్గు వ్యాధికి గురవు తారు. చిన్న పిల్లలలో శ్వాసమార్గానికి ఇబ్బందులు తలెత్తటం కారణంగా తెరలు, తెరలుగా దగ్గు వస్తుంది. బొర్డ్‌టెల్లా పెర్టుసిస్ అనే సూక్ష్మ క్రిమివల్ల ఈవ్యాధి వస్తుంది. శారీరకంగా దృఢంగాఉండే పిల్లల్లో ఈ వ్యాధి తక్కువగానే కనిపిస్తుంది. బలహీనంగా ఉండే వారిలో తీవ్రస్థాయిలో ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాధి కారక క్రిములు శరీరంలో ప్రవేశించిన నాటి నుంచి వ్యాధి బైటపడటానికి వారం నుంచి పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంటుంది. తొలుత అతి సాధారణమైన దగ్గుగానే ప్రారంభమై తరువాత ఇది తీవ్ర స్థాయికి చేరి తెరలు తెరలుగా దగ్గు వస్తుంది. దీనితో శ్వాస తీసుకోవడం కష్టతర మవు తుంది. కోరింత దగ్గు వచ్చిన వారికి మొదటి దశలో ముక్కు నీరు, కన్నీరు కారటం, ఆకలి తగ్గుట, నీరసంగా ఉండటం, రాత్రి పూట దగ్గు మరియు తుమ్ములు వస్తాయి. రెండవ దశలో తెరలు తెరలుగా దగ్గుతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మూడవ దశలో వ్యాధి తగ్గుముఖం పట్టే దశ ఇది నాలుగవ వారం తర్వాత మొదలవుతుంది.

కోరింత దగ్గు లక్షణాలు;

సీజనల్ వైరస్, క్రూప్, ఆస్తమా, న్యుమోనియా వల్ల కోరింత దగ్గు వస్తుంటుంది. పిల్లలలో నిరంతర దగ్గు వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. దగ్గుతోపాటు వాంతులు కూడా సంభవించవచ్చు. రోగి పరి స్థితి ఆందో ళన కరంగా కనిపిస్తుంది. తీవ్రమైన దగ్గు వల్ల కళ్లు ఎరు పెక్కు తాయి. ముక్కు నుంచి రక్తం కారే అవకాశాలున్నాయి. ముఖం ఉబ్బుతుంది. తీవ్ర మైన కోరింత దగ్గుతో బాధపడేవారికి వాంతులయ్యే అవ కాశాలున్నాయి కనుక ఆహా రాన్ని కొద్ది మొత్తాలలో ఇవ్వడం మంచిది. ఈ వ్యాధిగ్రస్తులు బ్రాంకైటిస్‌తో బాధ పడే అవకా శాలు కూడా హెచ్చుగా ఉన్నాయి. ఊపిరితిత్తులు వాపునకు గురవుతాయి. బ్రాంకో న్యుమోనియా, ఫిట్స్‌వంటి సమస్యలు కూడా ఎదురు కావచ్చు. వ్యాధి సోకిననాటి నుంచి ఆరు వారాల పాటురోగి ఇబ్బంది పడాల్సి వస్తుంది తరువాత తగ్గుముఖం పడుతుంది. కొన్ని కేసుల్లో వ్యాధితగ్గు ముఖం పట్టడానికి కొన్నినెలలు కూడా పట్టే అవకాశాలు ఉంటాయి.

కోరింత దగ్గు జాగ్రత్తలు :

రోగి చల్లని వాతావారణంలో ఉండకుండా వేడి వాతావరణంలో ఉండేలా చూడాలి. తద్వారా బ్రాంకో న్యు మోనియా రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఫిట్స్‌, కోపంవంటి ఉద్రేకాలకు గురికాకుండా చూడాలి. ఆలివ్‌ ఆయిల్‌ను ఛాతిపైన, వెన్నెముకపైన రాయడం వలన కొంత ఉపయోగం ఉంటుంది. గాలి ధారాళంగా ఆడేగదిలో రోగికి విశ్రాంతి కల్పించాలి. పిల్లలను దుమ్మూధూలికి దూరంగా ఉంచాలి. చలికాలంలో మరింత జాగ్రత్తలు పాటించాలి. బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలకు చలికి తట్టుకునే దుస్తుల్ని వేయాలి. అలాగే ఆహారనియమాల్లో జాగ్రత్తలు పాటించాలి. దగ్గుతో బాధపడుతున్న వారికి ఫిట్స్‌ వచ్చే అవకాశా లుంటాయి కాబట్టి, ఎప్పుడూ వారిని కనిపెట్టుకుని ఉండాలి. ఈ వ్యాధి తగ్గుముఖం పట్టేందుకు ఆయా పిల్లల శారీరక, మానసిక దృఢత్వం బట్టి ఆధారపడి ఉంటుంది. సకాలంలో చిన్నారులకు టీకాలు ఇవ్వటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.