మోడీ మౌనం ఎందుకు ? మ‌న సైనికుల‌ను చంప‌డానికి వారికెంత ధైర్యం

  • Published By: madhu ,Published On : June 17, 2020 / 06:11 AM IST
మోడీ మౌనం ఎందుకు ? మ‌న సైనికుల‌ను చంప‌డానికి వారికెంత ధైర్యం

భార‌త్ – చైనా జ‌వాన్ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లు..భార‌త జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొంద‌డంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. చైనా పోరులో 20 మంది భార‌తీయ సైనికులు అమ‌ర‌ల‌వ‌డంపై ఆయ‌న దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మ‌న సైనికుల‌ను చంపేయ‌డానేకి వారికి ఎందుకంత ధైర్యం ? మ‌న భూమిని ఆక్ర‌మించుకోవ‌డానికి అంత దుస్సాహానికి ఒడిగ‌డుతారా ?

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది చాలు…ఇంత జ‌రుగుతున్నా భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ సూటిగా ప్ర‌శ్నించారు. భార‌త్ – చైనా ద‌ళాల మ‌ధ్య జ‌రిగిన  హింసాత్మ‌క ఘ‌ట‌న జ‌రిగిన గంట‌లు జ‌రుగుతున్నా కేంద్ర ప్ర‌భుత్వం మౌనంగా ఉండ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది చాలు..అక్క‌డ ప్ర‌స్తుతం ఏమి జరుగుతుందో తెలియాల‌ని డిమాండ్ చేశారు. 

చైనా సైనికులు జ‌రిపిన దాడిని ప‌లువురు ఖండిస్తున్నారు. దేశ వ్యాప్తంగా…నిర‌స‌న‌లు వ్య‌క్త‌మౌతున్నాయి. చైనా ప్రెసిడెంట్ దిష్టి బొమ్మ‌ను ద‌గ్ధం చేస్తున్నారు. 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొంద‌డంపై కాంగ్రెస్ పార్టీ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేసింది. సైనికుల వీర‌మ‌ర‌ణం త‌న‌కు చాలా బాధించింద‌ని పార్టీ అద్య‌క్షురాలు సోనియా గాంధీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

 

Read: ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్సా కేంద్రం..22ఫుట్ బాల్ స్టేడియాలంతా పెద్దది