ఇంట్లో నుంచి పనిచేసేవారిలో మానసిక ఆరోగ్యాన్నిచ్చే ఈ 10 టిప్స్ తెలుసుకోవాల్సిందే

  • Published By: srihari ,Published On : May 15, 2020 / 03:44 AM IST
ఇంట్లో నుంచి పనిచేసేవారిలో మానసిక ఆరోగ్యాన్నిచ్చే ఈ 10 టిప్స్ తెలుసుకోవాల్సిందే

కరోనా పుణ్యామని అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసుకునేవారంతా ఇంటినుంచే పనిచేయాల్సిన పరిస్థితి. కరోనా వైరస్ వ్యాప్తితో స్వీయ నియంత్రణకు అలవాటు చేసుకోవాల్సిన అవసరం. సాధారణంగా ఇంట్లోనుంచి పనిచేయాలంటే సవాల్ తో కూడుకున్నపనిగా చెబుతున్నారు మానసిక నిపుణులు. ఆఫీసుల్లో మాదిరిగా ఇంట్లో సరైన సౌకర్యాలు ఉండకపోవచ్చు. దీనికారణంగా చాలామందిలో మానసికపరమైన సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. స్వీయ నియంత్రణ లేకపోవడం.. పనిపై ఏకాగ్రత కోల్పోవడం, నిర్లీప్తత ఎక్కువగా కనిపిస్తుంటుంది. 

ఎందుకంటే.. వృత్తిపరమైన హెల్త్ సైకాలజీ రీసెర్చ్ ప్రకారం.. సెల్ఫ్ కంట్రోల్ విషయంలో ఒక విషయాన్ని సూచిస్తోంది. ఆలోచనలు, ప్రవర్తన శైలి, భావోద్వేగాలను అణచివేయగల సామర్థ్యం అనేవి మీ లక్ష్యాన్ని సాధించడానికి సహకరించవు. స్వీయ నియంత్రణకు తప్పనిసరిగా మానసిక శక్తి అవసరమని సూచిస్తుంది. దీనిపై ఎంతో సాధన చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇంటి నుంచి పనిచేయడానికి గణనీయమైన స్వీయ నియంత్రణ అవసరం. మీరు ఉండే ప్రదేశంలోని వాతావరణం మీ మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తుంది. 

ఆఫీసుల్లో పనిచేసినప్పుడు వర్క్ సమర్థవంతంగా పూర్తిచేయడానికి వీలుంటుంది. చాలామంది ఉద్యోగులకు ఇంటి వాతావరణం అనుకూలంగా ఉండదు. మన వాతావరణంలో మార్పులకు అనుగుణంగా స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమైనది. లాక్ డౌన్ సమయంలో స్వీయ నియంత్రణ కోసం ఉద్యోగులు తమ మానసిక వనరులను ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి. ఇంటి నుండి పనిచేసేటప్పుడు మానసిక ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం.. 

1. మీ పని కోసం సరైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయండి. సాధ్యమైనంతవరకు పరధ్యానం నుంచి బయటపడండి. 
2. షెడ్యూల్‌ను డెవలప్ చేయండి. సాధ్యమైనంతవరకు పనిలో విరామాలకు సంబంధించి స్పష్టత ఉండాలి. 
3. వీలైతే, పిల్లలు, పెంపుడు జంతువుల సంరక్షణకు అవసరమైన సమయాన్ని కేటాయించండి. 
4. మీ ఇమెయిల్ కమ్యూనికేషన్‌ను పెంచుకోండి. ఇమెయిల్‌లకు ప్రతిస్పందించడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించండి.
5. కాఫీ విరామం లేదా మీ పని దినాన్ని సులభమైన దినచర్యతో ప్రారంభించండి. 
6. పని, విశ్రాంతి కోసం ప్రత్యేక సమయాలను ఏర్పాటు చేయండి. అదే సమయాలకు కట్టుబడి ఉండండి.
7. పనిని పూర్తి చేయడానికి గడువుగా ముందస్తు లక్ష్యాలను మానుకోండి.
8. మీరు మీ విశ్రాంతి సమయాన్ని గడిపే గది కాకుండా వేరే గదిలో పని చేయండి. ముఖ్యంగా మీ పడకగదిలో పని చేయొద్దు. 
9. పని చేయని సమయంలో అన్ని రకాల పని సంబంధిత విషయాలకు దూరంగా ఉండండి.
10. అన్ని పనుల్లో పాల్గొనడం ద్వారా మీ పూర్తి దృష్టిని ఆకర్షిస్తుంది. వ్యాయామం, వంట, సంపూర్ణ ధ్యానం లేదా మీ పిల్లలు లేదా పెంపుడు జంతువులతో ఆడుకోవడం వంటివి చేయాలి. 

Read Here >> మనలో డేటింగ్, రిలేషన్‌షిప్ ఫీలింగ్స్‌ను లాక్‌డౌన్ ఇలా మార్చేస్తోందా?