మనలో డేటింగ్, రిలేషన్‌షిప్ ఫీలింగ్స్‌ను లాక్‌డౌన్ ఇలా మార్చేస్తోందా? 

  • Published By: srihari ,Published On : May 14, 2020 / 10:31 AM IST
మనలో డేటింగ్, రిలేషన్‌షిప్ ఫీలింగ్స్‌ను లాక్‌డౌన్ ఇలా మార్చేస్తోందా? 

కరోనా వైరస్.. ప్రపంచమంతా ఈ భయంతోనే బతుకుతోంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాత్కాలిక లాక్ డౌన్ లతో వైరస్ పూర్తిగా సమసిపోదని తెలుసు. కొవిడ్- 19 లాక్ డౌన్ ఎన్నో పాఠాలు నేర్పింది. ప్రపంచంలో కరోనా మార్పును తెచ్చింది. మానవుని మనుగడ కోసం కరోనా మార్పులకు అనుగుణంగా జీవించడం అలవాటు చేసుకుంటున్నారు.

బంధాలు, అనుబంధాలు అన్నింటిలోనూ కొత్త మార్పులను తీసుకొచ్చింది కరోనా. ఇప్పటివరకూ సమాజంలోని కొన్ని అంశాలపై కూడా లాక్ డౌన్ అధిక ప్రభావం చూపిందనే చెప్పాలి. ప్రత్యేకించి డేటింగ్, రిలేషన్ షిప్‌లపై భావనను కూడా మార్చేస్తుందా కరోనా అంటే.. అవుననే చెప్పాలి.  COVID-19 లాక్ డౌన్ సమయంలో డేటింగ్, సంబంధాల భావనను మారుస్తుందా అనేదానిపై చాలామంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.. అవేంటో ఓసారి లుక్కేయండి.. 

1. డేటింగ్.. కొత్తవారితో కష్టమే మరి :
డేటింగ్.. కొత్తగా డేటింగ్ చేస్తున్న వారు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. చాలామంది డేటింగ్ ప్రారంభంలో లాక్ డౌన్ సమయాన్ని కష్టంగా గడిపేస్తుంటారు. అందుకే లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారా? ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ, డేటింగ్ చేయబోయే కొత్త వ్యక్తి విషయంలో కాస్తా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డేటింగ్ చేయబోయే వ్యక్తికి కరోనా వైరస్ లేదని ఎలా నిర్ధారించుకోవడం.. అంటే.. లక్షణాలు కనిపించని వారెందరూ ఉంటారు. వీరిలో కరోనా వైరస్ ఉంటే అది డేటింగ్ చేసేవ్యక్తికి కూడా సోకే ప్రమాదం ఉంటుంది. కొత్త వ్యక్తితో డేటింగ్ చేయడమంటే బిగ్ ఛాలెంజ్ కదా మరి.. 
love

2. ఒకే వ్యక్తితో ఎక్కువ రోజులు గడపడం కష్టమే :
లాక్ డౌన్ సమయంలో ఒకే వ్యక్తితో ఎక్కువ రోజులు గడపడం కూడా కష్టమేనని అంటున్నారు ఒక వ్యాపారవేత్త జాటిన్ యాదవ్. నెల రోజులకు పైగా తన భార్యతో కలిసి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు. ఇన్ని రోజులు ఇంట్లోనే గడిపిన తర్వాత.. ఒకరినొకరు ఇన్ని రోజులు ఎలా గడపడం ఎంత సులభమో గ్రహించానని తెలిపారు. ఒకేచోట కలిసి ఉంటే గొడవలు కామన్. సాధారణ సమయంలో అయితే ఇలాంటి గొడవలను ఎవరూ గుర్తించలేరు. లాక్ డౌన్‌లో తన భాగస్వామితో కలిసి ఒకే ఇంట్లో ఎక్కువ సమయం గడిపితే అది ఎంత రొమాంటిక్ గా ఉంటుందో లాక్ డౌన్ నిరూపించిందని అన్నారు. అవును.. కరోనా వైరస్ జీవితం, బంధాలకు సంబంధించి ఎన్నో ముఖ్యమైన పాఠాలు నేర్పిందని అభిప్రాయపడ్డారు. 
lock down

3. లాక్‌డౌన్‌లో రిలేషన్ షిప్ బలపడుతుందా? :
అస్సాంలో లాక్ డౌన్ ప్రారంభానికి ముందు తన భార్య ఆమె తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లింది. ఒక్కసారిగా అప్పటినుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. అతడి భార్య పుట్టింట్లోనే ఉంటోంది. సాగర్ జైన్ అనే వ్యక్తి మాత్రం ఢిల్లీలో ఒంటరిగానే ఉంటున్నాడు. అస్సాంకు వెళ్లక ముందు తన భార్యతో తరచూ గొడవపడేవాడు. లాక్ డౌన్ సమయంలో తన భార్య విలువ ఏంటో తెలుసొచ్చిందని అన్నాడు. తనను మిస్ అయ్యాననే భావన ఎక్కువగా ఉందనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారిని ఎదురించి జీవించగలిగితే తమ బాంధవ్యం కూడా బలపడుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. 
Strong relations

4. బంధాలన్నీ ఎంతో విలువైనవి :
‘చెన్నైలో  వయస్సు పైబడిన నా తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు. నేను నా భర్తతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాను. లాక్ డౌన్ సమయంలో ఒకటే ఆందోళనగా ఉండేది. ఒకవేళ తల్లిదండ్రులకు అత్యవసర వైద్య సాయం ఉంటే నేను వారిని చేరుకోలేను. నా భర్త.. నేను మా తల్లిదండ్రులను హోంటౌన్ లోనే వదిలేసి ఉద్యోగాల కోసం ఢిల్లీ వచ్చాం. తల్లిదండ్రులను వదిలేసి మేం ఇక్కడే ఉండిపోవడం సరైనేదా? అనిపిస్తుంటుంది. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాం’ అని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎస్ రేవతి తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. 
parents

5. భవిష్యత్తులో డేటింగ్.. ఆన్‌లైన్‌లోనే :
కరోనా.. లాక్ డౌన్‌కు ముందు.. ఇప్పుడు డేటింగ్ ట్రెండ్ మారిపోయింది. ఆన్ లైన్ డేటింగ్ మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది. క్వారంటైన్ సమయంలో ఇప్పటికే చాలామంది ఆన్ లైన్ డేటింగ్ సర్వీసులను వినియోగించుకుంటున్నారని చాలా నివేదికలు వెల్లడించాయి. లాక్ డౌన్ సమయంలో ఎక్స్ ట్రా మెరిటల్ డేటింగ్ (అక్రమ సంబంధాలు) సర్వీసు ప్రొవైడర్లకు ఎక్కువ సంఖ్యలో సబ్ స్ర్కైబర్లు పెరిగిపోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఎవరూ ఒప్పుకున్నా లేకున్నా ఆన్‌లైన్ డేటింగ్ భవిష్యత్ అంటూ హరికేష్ తివారీ అనే విద్యార్థి అభిప్రాయపడ్డారు. 
online dating

Read Here>> లాక్‌డౌన్ లవ్.. పడక గదిలో మెరవాలంటే సైన్స్ చెప్పిన ఈ టిప్స్ పాటించాల్సిందే