లాక్‌డౌన్ లవ్.. పడక గదిలో మెరవాలంటే సైన్స్ చెప్పిన ఈ టిప్స్ పాటించాల్సిందే

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 01:06 PM IST
లాక్‌డౌన్ లవ్.. పడక గదిలో మెరవాలంటే సైన్స్ చెప్పిన ఈ టిప్స్ పాటించాల్సిందే

లాక్ డౌన్ పుణ్యామని అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు బయటి పనులతో బిజీగా ఉండే వారంతా సరదాగా కుటుంబ సభ్యులతో గడిపేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో దంపతుల్లో లైంగిక సంబంధాలకు సరైన సమయమని అంటున్నారు సెక్సాలిజిస్టులు. లాక్ డౌన్ కాలంలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండే వారంతా తమ లైంగిక జీవితాన్ని ఎలా గడుపుతున్నారనే దానిపై ఓ సర్వే నిర్వహించారు. ఐసోలేషన్‌లో గడిపిన ఐదు జంటలపై నిర్వహించిన సర్వే కొన్ని అంశాలను రివీల్ చేసింది. చాలామంది జంటలు తమ లైంగిక జీవితాన్ని ఆశ్వాదిస్తుండగా.. మరో పదిమందిలో ఒకరు తమ బంధానికి బ్రేకప్ తో విడిపోతున్నాయని తెలిపింది. 

దీనికి అసలు కారణం.. జంటల్లో ఆందోళన, onbuy.com అనే వెబ్ సైట్ 62 శాతం మందిపై సర్వే నిర్వహించింది. ఇందులో చాలామంది తమ సంబంధాన్ని మధ్యలోనే బ్రేకప్ చెప్పేసి విడిపోతున్న జంటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో సెలబ్రెటీలు కూడా మినహాయింపు కాదు. జెస్సీ నెల్సన్, క్రిష్ హుగ్స్ కూడా తమ 18 నెలల రిలేషన్ ను బ్రేక్ చేసి ఎవరికివారు విడిపోయారు.

మరోవైపు బాయ్ జోన్స్ షేన్ లించ్ కూడా తన భార్య షీనా వైట్‌తో 13ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రతిఒక్కరూ తమ బంధాన్ని పటిష్టంగా ఉంచుకోనేందుకు సెక్స్ ఎక్స్‌పర్ట్ Kate Taylor కొన్ని టిప్స్ అందిస్తున్నారు. ఈ ఫార్మూలా పాటిస్తే చాలు.. ప్రతి జంట తమ లైంగిక జీవితాన్ని ఎంతో హాయిగా ఆశ్వాదించొచ్చు. 

డేటింగ్‌పై లాక్‌డౌన్ ఎఫెక్ట్ :
ఐసోలేషన్ పొడిగించడంతో కొత్త రిలేషన్ షిప్‌లో మరిన్ని సమస్యలను సృష్టించొచ్చు. లాక్ డౌన్ సమయంలో డేటింగ్ లో ఉన్నవారిపై ప్రభావం పడింది. ఒకవేళ మీరు కేవలం డేటింగ్ మాత్రమే చేస్తుంటే.. కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. ఒకరికొకరు ప్రాక్టికల్ గా లేదా ఎమోషనల్ సపోర్టు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి సమయాల్లో దూరంగా ఉంటే.. ఎక్కడలేని ఒత్తిడి ఎదురవుతుంది. ఒత్తిడిని అధిగమించే దిశగా ప్రయత్నాలు చేయాలి. 

ఫన్‌తో ప్రేమను పంచుకోండి :
డేటింగ్ ఆరంభంలో సరదాగా గడపడం ఎంతో థ్రిల్‌గా అనిస్తుంది. ఒకరినొకరు తమ అనుభవాలను పంచుకోవాలి. సరదాగా కబర్లు చెప్పుకోవడం చేయాలి. ఆన్‌లైన్ అయినప్పటికీ ఇద్దరికి ఆనందాన్ని కలిగించే విషయాలపైనే ఎక్కువగా చర్చించాలి. 

మీ వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు :
డేటింగ్ ప్రారంభంలో.. సాధారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు మీ భాగస్వామితో మీ జీవితాన్ని గడుపుతుంటారు. ఇప్పుడూ అలానే కొనసాగించండి. మీ కొత్త భాగస్వామి వారి స్వంత అభిరుచులు, ఆసక్తులకు సమయం కేటాయించినప్పుడు మీరు తప్పుపట్టరాదు. వారి వ్యక్తిగత జీవితానికి కూడా స్వేచ్ఛను ఇవ్వాల్సి ఉంటుంది. 

భయాందోళన వద్దు  : 
మీ భాగస్వామి మీరు చెప్పేది వినడం లేదని, వారు మోసం చేస్తున్నారని, అనారోగ్యంగా లేదా ఆసక్తిని కోల్పోతున్నారనే భయంతో మిమ్మల్ని మీరు బాధపడొద్దు. కరోనావైరస్ సంక్షోభం మనకు ఏదైనా బోధిస్తుంది. మనం నియంత్రించగల విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలనేది మరవొద్దు. అంతకుముందు అంతా బాగానే అనిపిస్తే, ఇప్పుడు బాగానే ఉంది. అది కాకపోతే, దాన్ని ఎదుర్కోవటానికి మీకు బలం ఉంటుంది. మీ స్వీయ సంరక్షణను కొనసాగించండి. స్నేహితులతో మీ భావాలను పంచుకోండి. 

శారీరకంగా ధృడంగా ఉండండి :
మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. అది మీలోని ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ మూడ్ కు మంచి బూస్టర్ కూడా. వాదనలకు చోటుండదు. మీ సమస్యను మార్చేస్తుంది. ఆందోళనతో మీలోని లైంగిక కోరికలు తగ్గిపోవొచ్చు. శారరీకంగా కనెక్ట్ అయ్యేందుకు ఫోకస్ పెట్టండి. మసాజ్, హగ్స్ వంటి నాన్ సెక్సువల్ చర్యలతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 

ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు :
మీ మనస్సు ఎప్పుడు బాగుండేలా చూసుకోండి. కొన్నిరోజుల పాటు ఇన్ స్ట్రాగ్రామ్ వంటి వాటికి దూరంగా మీతో మీరు గడపండి. లేదంటే రియలిస్టిక్ రోల్ మోడల్స్ ను ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూపులతో విసిగిపోతే నోటిఫికేషన్లను టర్న్ ఆఫ్ చేసేయండి. సాధ్యమైనంతవరకు శారీరక స్పర్శలతో మిమ్మిల్ని మీరు ఉత్తేజపరుచుకోండి. ఒక కౌగిలి, జట్టును రుద్దడం, ముద్దు పెట్టుకోవడం వంటి చర్యలతో నరాలను శాంతపరుస్తుంది. ఇతర కుటుంబాలతో మిమ్మల్ని పోల్చుకోకండి.. ప్రతిరోజు కొత్త అనుభూతిని పొందండి.. కొత్తగా జీవించేందుకు ప్రయత్నించండి.