WWW Movie : ‘కన్నులు చెదిరే అందాన్నే, వెన్నెల తెరపై చూశానే’.. సాంగ్ కిరాక్ ఉందిగా..!

‘కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెరపై చూశానే.. కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే... నన్నిక నీలో విడిచానే.. నిన్నలు గాల్లో కలిపానే...

WWW Movie : ‘కన్నులు చెదిరే అందాన్నే, వెన్నెల తెరపై చూశానే’.. సాంగ్ కిరాక్ ఉందిగా..!

Www Movie

WWW Movie: ‘కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెరపై చూశానే.. కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే… నన్నిక నీలో విడిచానే.. నిన్నలు గాల్లో కలిపానే… ఇపుడే ఇంకోలా నే మళ్ళీ పుట్టానే… నీ కురులా కెరంటంలో నా చూపులిలా మునిగినవేమో… చిక్కానే చేపై నే తీగ‌లులేని ఈ వ‌లలో.. నెమ్మ‌దిగా నువ్వొదిలే న‌వ్వుల గాలాల్లో..’ అంటూ ఆహ్లాద‌క‌రంగా సాగే ఈ అంద‌మైన మెలోడి సాంగ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి. గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ చిత్రంలోనిది.

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘‘కన్నులు చెదిరే…’’ లిరికల్ వీడియో సాంగ్‌ను ఇటీవ‌ల ‘మేజ‌ర్‌’ అడవి శేష్ రిలీజ్ చేసి సాంగ్ అద్భుతంగా ఉందంటూ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీమ్‌ని ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే.. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన ఈ పాట శ్రోత‌ల‌ని ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంచనాల‌ను మ‌రింత పెంచింది. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ గీతాన్ని యాజిన్‌ నిజార్‌ ఆలపించారు. సైమన్‌ కె కింగ్‌ స్వరాలు సమకూర్చారు..

ఈ సంద‌ర్భంగా.. చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ – ‘‘మా రామంత్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. అలాగే ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ‘నైలున‌ది’, ‘లాక్‌డౌన్’ ర్యాప్‌ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ‘మేజ‌ర్’ అడివి శేష్‌ గారు రిలీజ్ చేసిన ‘కన్నులు చెదిరే..’ లిరిక‌ల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా ఆర్గానిక్ వ్యూస్‌ని సొంతం చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా ఈ పాట విడుద‌ల చేసిన అడివి శేష్ గారికి మ‌రియు ఆదిత్య మ్యూజిక్ వారికి మా రామంత్ర క్రియేష‌న్స్ త‌ర‌పున ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాం.. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారు. గుహ‌న్ గారు ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించారు. తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు..