COVID: మా జీరో-కొవిడ్ విధానమే స‌రైన‌ది: చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్

కరోనాను ఎదుర్కొనేందుకు ప్ర‌పంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వంటి విధానాల‌ను పాటిస్తుంటే చైనా మాత్రం జీరో-కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది. క‌రోనాతో స‌హజీవనం చేస్తూనే దాన్ని కట్ట‌డి చేసుకుంటూ పోవ‌డానికి ప్ర‌పంచ దేశాలు ప్రాధాన్యం ఇస్తుంటే చైనా తీరు మాత్రం మ‌రోలా ఉండడం గ‌మ‌నార్హం.

COVID: మా జీరో-కొవిడ్ విధానమే స‌రైన‌ది: చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్

Xi Jinping

COVID: కరోనాను ఎదుర్కొనేందుకు ప్ర‌పంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వంటి విధానాల‌ను పాటిస్తుంటే చైనా మాత్రం జీరో-కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది. క‌రోనాతో స‌హజీవనం చేస్తూనే దాన్ని కట్ట‌డి చేసుకుంటూ పోవ‌డానికి ప్ర‌పంచ దేశాలు ప్రాధాన్యం ఇస్తుంటే చైనా తీరు మాత్రం మ‌రోలా ఉండడం గ‌మ‌నార్హం. దీనిపై చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ స్పందించారు. చైనా అనుస‌రిస్తోన్న జీరో-కొవిడ్ పాల‌సీని స‌మ‌ర్థించారు. వుహాన్‌లో క‌రోనా ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించిన ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… క‌రోనాను ఎదుర్కోవ‌డంలో త‌మ దేశం అనుస‌రిస్తోన్న విధానం ప్ర‌జ‌ల ప్రాణాల‌ను, ఆరోగ్యాన్ని కాపాడింద‌ని చెప్పారు.

Maharashtra: మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణం.. డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్

దేశ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా సీపీసీ కేంద్ర క‌మిటీ క‌రోనా క‌ట్ట‌డి విధానాన్ని రూపొందించింద‌ని అన్నారు. చైనా హెర్డ్ ఇమ్యూనిటీ వంటి విధానాన్ని అనుస‌రిస్తే విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కొనేద‌ని ఆయ‌న చెప్పారు. జీరో-కొవిడ్ విధానం వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తాత్కాలికంగా ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్ట‌కూడ‌ద‌ని జీరో-కొవిడ్ విధానాన్నే అనుస‌రిస్తున్నామ‌ని చెప్పారు. చిన్నారులు, వృద్ధుల ప్రాణాల‌ను కాపాడుకోవాల‌ని ఆయ‌న అన్నారు.