Yadamma Raju : ఇంకా యాక్సిడెంట్ నుంచి కోలుకొని యాదమ్మ రాజు.. హాస్పిటల్ లో సేవలు చేస్తున్న భార్య..

ఇటీవల యాదమ్మ రాజుకి యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో కాలికి బాగా దెబ్బ తగలడంతో ఆపరేషన్ చేసినట్టు సమాచారం.

Yadamma Raju : ఇంకా యాక్సిడెంట్ నుంచి కోలుకొని యాదమ్మ రాజు.. హాస్పిటల్ లో సేవలు చేస్తున్న భార్య..

Yadamma Raju met with Accident rest in Hospital walking with support of wife stella raj

Updated On : July 30, 2023 / 1:52 PM IST

Yadamma Raju :  పటాస్ షోలో ఒక స్టూడెంట్ గా వచ్చిన రాజు తన మాటలతో, కామెడీతో ఆకట్టుకొని అదే షోలో కమెడియన్ గా యాదమ్మ రాజు అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం యాదమ్మ రాజు జబర్దస్త్ చేస్తూనే పలు సినిమాల్లో నటిస్తున్నాడు. స్టెల్లా రాజ్ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు.

ఇటీవల యాదమ్మ రాజుకి యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో కాలికి బాగా దెబ్బ తగలడంతో ఆపరేషన్ చేసినట్టు సమాచారం. యాదమ్మ రాజు హాస్పిటల్ లో ఉన్న ఓ వీడియోని, స్టెల్లా తనకి సపోర్ట్ గా ఉండి నడిపిస్తున్న వీడియోని ఇటీవల వీరు తమ సోషల్ మీడియా ద్వారా తెలిపి యాక్సిడెంట్ అయిన విషయాన్ని తెలిపారు. ప్రస్తుతానికి యాదమ్మ రాజు కాలి దెబ్బ తగ్గడానికి కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం.

Kangana Ranaut : బట్టలు సరిగ్గా వేసుకో.. సౌత్ హీరోలని చూసి నేర్చుకో.. రణవీర్ సింగ్‌కు కంగనా కౌంటర్లు..

తాజాగా యాదమ్మ రాజు నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా రిలీజ్ ఉండటంతో కష్టమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టిక్ సాయంతో వచ్చాడు. ఇక కొన్ని ప్రమోషన్స్ ని హాస్పిటల్ బెడ్ మీద నుంచే వీడియో కాల్స్ లో చేశాడు యాదమ్మ రాజు. దీంతో రాజు త్వరగా కోరుకోవాలని పలువురు టీవీ ప్రముఖులు, నెటిజన్లు కోరుకున్నారు.