zinc : జింక్ తో జలుబు,దగ్గుకు చెక్…పరిశోధనల్లో వెల్లడి

వెస్ట్రన్‌ యూనివర్శిటీ పరిశోధకుల బృందం 5,500 మందిపై 28 జింక్ ట్రయల్స్‌ నిర్వహించింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారికి నోటి ద్వారా లేదా నాసికా స్ప్రే ద్వారా జింక్ ఇవ్వవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి.

zinc : జింక్ తో జలుబు,దగ్గుకు చెక్…పరిశోధనల్లో వెల్లడి

Zinc (1)

zinc : శరీరానికి అవసరమైన పోషకాలను అందించటంలో జింక్ ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. శరీరానికి కావాల్సిన ఇదో ముఖ్యమైన ఖనిజం. మానవ శరీర ఎదుగుదలకు, నిర్వాహణకు అంటు వ్యాదుల నుండి తట్టుకోవటానికి జింక్ అవసరత ఎంతైనా ఉంది. శరీరంలోని వివిధ ఎంజైములు, హార్మోన్లలో బాగంగా ఉంటుంది. సూక్ష్మ పోషకాల జాబితాలో జింక్ కూడా ఒకటి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఇది కొద్ది మోతాదులో శరీరానికి అవసరమౌతుంది.

జింక్ ఉండే ఆహారాలను తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన జింక్ ను రోజు వారిగా పొందవచ్చు. మన శరీరానికి అవసరమైన ఖనిజం.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, శరీర గాయాలను నయం చేయడం, కణాల పెరుగుదల, కణ విభజన మొదలైన వాటితోపాటు మన శరీరంలో 300 కి పైగా ఎంజైమ్‌ల కార్యకలాపాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో జింక్‌ లోపం చాలా సాధారణ, అనేక ఆరోగ్య సమస్యలకు కలిగిస్తుంది. జింక్‌ లోపం కారణంగా దృష్టి సమస్యలు, జుట్టు రాలడం, వానసలు గుర్తించకపోవడం, గాయాలు మెల్లిగా మానడం, విరేచనాలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు కనిపిస్తాయి.

యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, 14 ఏండ్ల వయసు పైబడిన అబ్బాయిలకు 11 మి.గ్రా, బాలికలకు 8 మి.గ్రా జింక్ అవసరం. గర్భిణిలకు 11 మి.గ్రా, పాలిచ్చే తల్లులకు 12 మి.గ్రా జింక్ అవసరం అవుతుంది. పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్డు, మాంసం, రొయ్యలు, గుల్లలు, పీతలు వంటి షెల్‌ ఫిష్‌, డార్క్‌ చాక్లెట్‌, బఠానీలు, పప్పుధాన్యాలు, బీన్స్‌, గోధుమలు, వోట్స్‌, జీడిపప్పు, పుట్టగొడుగుల్లో జింక్‌ సమృద్ధిగా లభిస్తుంది. గుమ్మడి గింజలు, బక్విట్‌లో కూడా జింక్‌ లభిస్తుంది.

ఆహారంలో ఉండే జింక్.. జలుబు, దగ్గును నివారిస్తుంది. దాని లక్షణాలను తగ్గిస్తుంది. జింక్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కేవలం 2 రోజుల్లోనే కోలుకోవచ్చునని కొత్త పరిశోధనలు చెప్తున్నాయి. వెస్ట్రన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తమ తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్‌ రేటును తగ్గించడం ద్వారా అనారోగ్యం సమయాన్ని తగ్గిస్తుంది. అయితే ఎంత పరిమాణంలో జింక్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవాలనేది స్పష్టంగా చెప్పలేదు.

వెస్ట్రన్‌ యూనివర్శిటీ పరిశోధకుల బృందం 5,500 మందిపై 28 జింక్ ట్రయల్స్‌ నిర్వహించింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారికి నోటి ద్వారా లేదా నాసికా స్ప్రే ద్వారా జింక్ ఇవ్వవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. పరిశోధన సమయంలో జింక్ ఇచ్చిన వారిలో పరిస్థితి 2 రోజుల్లో మెరుగుపడింది. అదే సమయంలో, జింక్ ఇవ్వని రోగుల్లో ఏడో రోజు వరకు లక్షణాలు కొనసాగాయి. అధ్యయనం సమయంలో ఏ రోగిలోనూ జింక్ దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.

జింక్-శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను అనుసంధానించే డజనుకు పైగా అధ్యయనాలను వెస్ట్రన్ యూనివర్శిటీలోని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇదేకాకుండా, జలుబు, దగ్గు లక్షణాలను కూడా జింక్‌ తగ్గిస్తుందని వీరి పరిశోధన వెల్లడించింది. ఇది ముక్కు కారటం, తలనొప్పి, పెరిగిన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. జింక్ లోపిస్తే శ‌రీర బ‌రువు అనూహ్యంగా త‌గ్గుతుంది. రుచి, వాస‌న చూసే శ‌క్తి త‌గ్గుతుంది. గాయాలు చాలా ఆల‌స్యంగా మానుతాయి. త‌ర‌చూ నీళ్ల విరేచ‌నాలు అవుతుంటాయి. ఆక‌లి త‌గ్గుతుంది. మొటిమ‌లు బాగా వ‌స్తాయి. చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌స్తాయి. కొన్ని సార్లు అది గ‌జ్జికి దారి తీసేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే వెంట్రుక‌లు బాగా రాలిపోతుంటాయి. ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా క‌నిపిస్తే వారు ఆల‌స్యం చేయకుండా వెంట‌నే జింక్ ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాల‌ను తినాలి.