Urine Color : మూత్రం రంగుతో వ్యాధి నిర్ధారణ ఎలాగో తెలుసా?..

సాధారణంగా మూత్రం లేత పసుపు లేదా తెలుపు రంగులో వస్తుంది. మరికొందరికి మాత్రం డార్క్ కలర్‌లో వస్తుంది. ఈ రంగు ముదురు గోధుమ రంగు లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది.

10TV Telugu News

Urine Color : మూత్రం కలర్ మీ సమస్యను ఇట్టే చెప్పేస్తుంది. యూరిన్ రంగు ఆధారంగా మీకేం సమస్య ఉందో ఓ అంచనాకు రావచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. ప్రతి దానికీ డాక్టర్ దగ్గరకి వెళ్లి టెస్టులు చేయించుకోలేం. ఇలాంటి సమయాల్లో మన ఆరోగ్యం బాగుందో లేదో తెలుసుకోవడానికి డబ్బు, కాలం వృథా కాకుండా మూత్రం రంగును బట్టి చెప్పేయెచ్చు. మూత్రం రంగు, వాసన ఆధారంగా కొన్ని సమస్యలనూ అంచనా వేయొచ్చు.

ఒంట్లో నీటిశాతం తగ్గటం, విటమిన్‌ బి6 తీసుకోవటం మూలంగా మూత్రం వాసన ఘాటుగా మారుతుంది. దీనికి భయపడాల్సిన పనేమీ లేదు. తగినంత నీరు తాగితే, విటమిన్‌ ప్రభావం తగ్గితే తిరిగి మామూలుగా అయిపోతుంది. అయితే మధుమేహం, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు, కాలేయ వైఫల్యంలోనూ మూత్రం వాసన మారిపోయే అవకాశముంది. వాసనలో ఏదైనా తేడా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.

మనిషి రోజుకి సరాసరిన కనీసం 8 సార్లు మూత్రానికి వెళ్లాలి. గర్భిణిలు, వృద్ధులు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు. ఇలాంటివేవి లేకుండానే ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తే మీకు యూరినరి సమస్యలు, కిడ్నీ సమస్యలు లాంటివి సమస్యలుండొచ్చు.యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ డ్ర‌గ్స్‌, కిమోథెర‌పీ డ్ర‌గ్స్‌, లాక్సేటివ్ డ్ర‌గ్స్‌ను వాడితే మూత్రం రంగు ఆరెంజ్ క‌ల‌ర్‌లో వ‌స్తుంది. దీంతోపాటు విట‌మిన్ బి2, బీటా కెరోటీన్ ఎక్కువ‌గా ఉండే క్యారెట్ వంటి ఆహారాల‌ను తిన్నా మూత్రం రంగు ఇలా మారుతుంది. అయితే ఇవేవీ కార‌ణాలు కాక‌పోతే మీరు నీటిని స‌రిగ్గా తాగ‌డం లేద‌ని అర్థం

మూత్రంలో అల్బుమిన్‌ స్థాయులు పెరిగితే నురగ కనబడొచ్చు. ఇది మధుమేహానికి తొలి సంకేతం కావొచ్చు. కిడ్నీల వడపోత ప్రక్రియ దెబ్బతిన్నా మూత్రం నురగగా రావటంతో పాటు రక్తం కూడా పడొచ్చు.మూత్రం లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటే ఆరోగ్యం బాగానే ఉన్నట్టు. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మీరు తక్కువ నీరు తాగుతున్నారని లేదా మీ శరీరంలో తగినంత నీరు లేదని అర్థం. మూత్రం నారింజ రంగులో కనుక ఉంటే కాలేయం లేదా పిత్తాశయ సమస్య కావచ్చు.

కిడ్నీ, మూత్రాశ‌య స‌మ‌స్య‌లు, కిడ్నీ స్టోన్లు, క్యాన్స‌ర్‌, ట్యూమ‌ర్లు, బ్ల‌డ్ క్లాట్స్‌, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు ఉన్నవారిలో మూత్రం ఎరుపు లేదా పింక్ రంగులోరంగులో వ‌స్తుంది.మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్లు, కిడ్నీ స్టోన్లు ఉంటే మూత్రం ఒక్కోసారి గ్రీన్ లేదా బ్లూ క‌ల‌ర్‌లోనూ వ‌స్తుంటుంది. డీహైడ్రేషన్‌, క‌డుపు నొప్పి, ర్యాషెస్‌, మూర్ఛ, ట్యూమ‌ర్లు వంటి స‌మ‌స్య‌లు ఉంటే మూత్రం బ్రౌన్ రంగులో వ‌స్తుంది.

పచ్చ కామెర్లు ఉన్నవారిలోనూ మూత్రం రంగు మారుతుంది. మూత్రం డార్క్ కలర్‌లో వస్తుంది. లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పచ్చకామెర్ల వ్యాధి వస్తుంది. దీని వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులో కనిపిస్తుంటాయి. దీనికి తగిన వైద్యం చేయించుకుంటే పచ్చకామెర్ల వ్యాధి నుంచి బయటపడొచ్చు. మూత్రం ముదురు గోధుమ రంగు వస్తుంటే అందుకు లివర్ వ్యాధులు కారణంగా చెప్పవచ్చు. బైలిరుబిన్ అనే ద్రవం ఎర్ర రక్తకణాలతో కలిస్తేనే మూత్రం ఇలా వస్తుంది.

సాధారణంగా మూత్రం లేత పసుపు లేదా తెలుపు రంగులో వస్తుంది. మరికొందరికి మాత్రం డార్క్ కలర్‌లో వస్తుంది. ఈ రంగు ముదురు గోధుమ రంగు లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఇలా డార్క్ రంగులో వస్తే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి, మూత్ర పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. మనిషి అనారోగ్యం బారినపడితేనే ఇలా డార్క్ రంగులో మూత్రం వస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మూత్రం డార్క్ కలర్‌లో వస్తే ఈ సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి.