గులాబీ దళిపతి గేర్ మార్చి అటాక్ చేస్తున్నారా? రేవంత్ సొంత జిల్లా మహబూబ్‌నగర్‌పై కేసీఆర్ దృష్టి

రేవంత్ పేరును ప్రస్తావించకుండానే ఓ రేంజ్‌లో విమర్శలు, ఆరోపణలు చేయడం మరోసారి సమ్‌థింగ్‌ స్పెషల్‌గా మారింది.

గులాబీ దళిపతి గేర్ మార్చి అటాక్ చేస్తున్నారా? రేవంత్ సొంత జిల్లా మహబూబ్‌నగర్‌పై కేసీఆర్ దృష్టి

Updated On : December 22, 2025 / 9:22 PM IST

KCR: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అటు సోషల్ మీడియాకు..ఇటు బీఆర్ఎస్ క్యాడర్‌కు కావాల్సిన స్టఫ్‌ ఇచ్చారు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్. నిన్నటి దాకా ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క అంటూ..సరికొత్త డైలాగులు పేల్చి..కథ వేరే ఉంటదని చెప్పకనే చెప్పారు. ఈక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డిని కేసీఆర్ డైరెక్ట్‌గా టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది.

రేవంత్‌ పేరును ప్రస్తావించకుండానే..గట్టిగానే అటాక్ చేశారు కేసీఆర్. రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన కృష్ణా జలాల వాటా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సెంట్రిక్‌గా కేసీఆర్ ఇండైరెక్ట్‌గా రేవంత్ రెడ్డిపై సీరియస్‌ కామెంట్స్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపితే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటూ ఫైరయ్యారు. డీపీఆర్ను వెనక్కి పంపితే భూమి, ఆకాశాన్ని ఏకం చేసి లొల్లి చేయాల్సింది పోయి ప్రభుత్వం సైలెంట్‌గా ఉందని పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కేసీఆర్.

Also Read: టార్గెట్ ఫిక్స్.. ఏపీలో కమలం సరికొత్త స్ట్రాటజీస్..! కూటమిలో ఉంటూనే..

పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో గ్రామగ్రామాన సభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టి తీరుతామ్. పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామ్. బహిరంగ సభలకు తాను స్వయంగా హాజరవుతానంటూ..ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతానని చెప్పకనే చెప్పారు గులాబీ బాస్. ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప.. వేరే ధ్యాసే లేదని రేవంత్ రెడ్డి సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎక్కడికక్కడ నిలదీస్తామని..అన్యాయాలపై ప్రశ్నిస్తామని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి పేరును పలకకుండా..
అయితే ఎక్కడా కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పలకలేదు. రేవంత్ పేరును ప్రస్తావించకుండానే ఓ రేంజ్‌లో విమర్శలు, ఆరోపణలు చేయడం మరోసారి సమ్‌థింగ్‌ స్పెషల్‌గా మారింది. ఆఖరికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును పలికిన కేసీఆర్, రేవంత్ రెడ్డి పేరును మాత్రం పలకకపోవడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ పేరును తీయకుండానే ఆయనపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారన్న చర్చ సాగుతోంది.

ఇక సీఎం రేవంత్ రెడ్డి యాజ్‌ టీజ్‌గా మాజీ సీఎం కేసీఆర్‌ను నేరుగా టార్గెట్ చేశారు. పదేళ్ల పాలనలో తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది అంటూ మండిపడ్డారు. కలుగులో దాక్కున్న ఎలుకలా ఇన్నాళ్లూ మౌనంగా ఉండి.. ఇప్పుడు బయటకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే జనవరి 2న జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలని..తెలంగాణకు ఎవరు మేలు చేశారో అక్కడే తేల్చుకుందామంటూ సవాల్ చేశారు రేవంత్‌.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ తీరు మారలేదని..కమీషన్ల కోసమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ దుమ్మెత్తిపోశారు. అయితే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా కేసీఆర్ సీఎం సొంత జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణాజలాల అంశాలను బేస్‌ చేసుకుని టార్గెట్ చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం యథావిధిగా కేసీఆర్‌ను టార్గెట్ చేయడం చర్చకు దారితీస్తోంది. ఇక ఇప్పుడు కేసీఆర్ యాక్టీవ్ కాబోతుండటంతో తెలంగాణలో ఇకపై రాజకీయం రంజుగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.